దివ్యాంగులకు పెట్రోల్ సబ్సిడీ
శ్రీకాకుళం పాతబస్టాండ్: దివ్యాంగులకు పెట్రోల్ సబ్సిడీ కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు విభిన్న ప్రతిభావంతుల సహాయ సంచాలకులు కె.కవిత అన్నారు. సొంత వ్యాపారం చేస్తున్నా లేదా గుర్తింపు కలిగిన ప్రైవేటు సంస్థల్లో పనిచేస్తున్న మూడు చక్రాల మోటరైజ్డ్ వాహనం కలిగి ఉన్న దివ్యాంగులు సబ్సిడీ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. నిర్ణీత ఫారం పూర్తి చేయాలని, ఆ ఫారంతో పాటు సదరం సర్టిఫికెట్, పెట్రోల్ కొనుగోలు చేసిన బిల్లులు, తెల్ల రేషన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, వాహనం రిజిస్ట్రేషన్ పత్రం, బ్యాంకు పాసు బుక్ మొదటి పేజీ, ఆధార్ కార్డు, ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్న ధ్రువీకరణ పత్రం, ఒక పాస్ పోర్టు సైజ్ ఫొటోను సహాయ సంచాలకులు, విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాలు, వయోవృద్ధుల సంక్షేమశాఖ, శ్రీకాకుళం వారి కార్యాలయానికి దరఖాస్తు చేసుకోవాలని, వివరాలకు 08942– 240519 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.
ఖైదీలు సత్ప్రవర్తనతో మెలగాలి
పాతపట్నం: పాతపట్నం సబ్‌జైల్‌లో ఉంటున్న ఖైదీలు సత్ప్రవర్తనతో మెలగాలని కోస్టల్ ఆంధ్ర రేంజ్(రాజమండ్రి) డీఐజీ ఎం.రవి కిరణ్ అన్నారు. వార్షిక తనిఖీల్లో భాగంగా స్థానిక సబ్ జైల్‌ను గురువారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఖైదీలతో మాట్లాడి వారికి అందిస్తున్న సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. జైలు రికార్డులు పరిశీలించారు. వంటగదులు, స్టార్ రూమ్‌లను తనిఖీ చేశారు. ఖైదీల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఆయనతో పాటు జిల్లా సబ్‌జైళ్ల అధికారి కె.మోహనరావు, సూపరింటెండెంట్ జి.రాము, జైల్ సిబ్బంది పాల్గొన్నారు.
బ్లాక్‌స్పాట్ జోన్స్ గుర్తించాలి : ఎస్పీ
శ్రీకాకుళం క్రైమ్ : జిల్లాలో రహదారి ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని, ప్రమాదాలు ఎక్కువ జరిగే బ్లాక్‌స్పాట్ జోన్స్ గుర్తించాలని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. గురువారం రాత్రి శ్రీకా కుళం, కాశీబుగ్గ సబ్ డివిజన్ పరిధి పోలీసు అధికారులతో వీడియోకాన్ఫరెన్స్ ద్వారా ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్య లు, ప్రమాద ప్రదేశాలు, కేసుల నమోదు, దర్యాప్తునకు సంబంఽధించి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ వాహనచోదకులకు, ప్రజలకు బ్లాక్ స్పాట్‌లపై అవగాహన కల్పించాలని, రహదారి భద్రతా నియమాలు పాటించని వారిపై జరిమానాలు విధించాలన్నారు. వేకువజామున ప్రధాన చెక్‌పోస్టుల వద్ద డ్రైవర్‌లకు ఫేస్‌వాష్ చేయించాలని, ట్రాఫిక్ ఎన్‌ఫోర్సుమెంట్ వర్క్స్ ముఖ్యకూడళ్ల వద్ద పెంచాలని, ప్రమాద హెచ్చరిక బోర్డులు, రోడ్లపై రేడియం స్టిక్కర్లు, పెయింటింగ్ సోలార్ బ్లింకర్స్ వంటివి ఏర్పాటు చేయాలని అన్నారు.
పసికందు మృతిపై
ఆర్డీఓ విచారణ
టెక్కలి రూరల్: నందిగాం మండలం కైజోల గ్రామానికి చెందిన పి.శ్రావణి అనే గర్భిణికి స్థానిక ఆస్పత్రిలో ప్రసవం జరిగింది. కానీ పుట్టిన వెంటనే బిడ్డ చనిపోయాడు. వైద్యుల నిర్లక్ష్యమే దానికి కారణమని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపించారు. దీనిపై పలు పత్రికల్లో వచ్చిన కథనాల ఆధారంగా గురువారం టెక్క లి ఆర్డీఓ ఎం.కృష్ణమూర్తి జిల్లా ఆస్పత్రికి వచ్చి విచారణ నిర్వహించారు. ప్రసూతి వైద్యురాలు ధనలక్ష్మి, స్రవంతితో పాటు ఆ సమయంలో ఉన్న సిబ్బందిని ప్రశ్నించారు. డెలివరీ సమయంలో ఏం జరిగిందో ఆరా తీశారు. ఈ ఘటనపై దర్యాప్తు జరిపేందుకు రిమ్స్ సూపరింటెండెంట్‌తో మాట్లాడి ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీ ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ కమిటీలో డిప్యూటీ డీఎంహెచ్‌ఓతో పాటు గా సీనియర్ గైనకాలజిస్ట్, సీనియర్ పిడియాట్రిస్ట్‌లు ఉంటారని తెలిపారు. కమిటీ నివేదిక వచ్చిన తరువాత బాధిత కుటుంబసభ్యులను సైతం పిలిపించి వారితో కూడా మాట్లాడి తుది నివేదికను కలెక్టర్‌కు అందజేసి తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆయనతో పాటుగా టెక్కలి తహసీల్దార్ దిలీప్ చక్రవర్తి, వైద్యులు లక్ష్మణరావు, పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment