● ప్రజల పక్షాన వైఎస్సార్‌సీపీ పోరుబాట నేడు
‘భవిష్యత్‌లో విద్యుత్ చార్జీల పెంపు ఉండబోదు. కుదిరితే వెంటనే చార్జీలు తగ్గిస్తాం. నాణ్యమైన విద్యుత్ రావాలంటే, విద్యుత్ చార్జీలు పెరగకుండా ఉండాలంటే కూటమి ప్రభుత్వం రావాలి. వైసీపీ పోవాలి. విద్యుత్ బిల్లుల భారం తగ్గిస్తామని మేనిఫెస్టోలో కూడా పెట్టాం.’ –ఎన్నికల ప్రచారంలో భాగంగా జిల్లాలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన సభల్లో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలివి.
●
మొదటి షాక్
15 నెలల పాటు అంటే ఈ ఏడాది నవంబర్ నుంచి 2026 జనవరి వరకు అమలు కానున్న ఈ అదనపు భారంతో ప్రజల నెత్తిన విద్యుత్ షాక్ ఇచ్చేలా సర్కార్ చర్యలకు దిగింది. ఈ క్రమంలో గరిష్టంగా యూనిట్‌కు సుమారు రూ.1.55 వరకు విద్యుత్ చార్జీలు పెరిగాయి.
రెండో షాక్
ఇంధన కొనుగోలు ఖర్చు సర్దుబాటు చార్జీలు (ఎఫ్‌పీపీసీఏ) పేరిట డిసెంబర్ నుంచి వరుసగా 15 నెలల పాటు భారం తప్పదని మళ్లీ భారం వేశారు. దీని ప్రకారంగా అదనంగా యూనిట్‌కు సుమారు మరో రూ.1.52 వరకు పెరిగే అవకాశముంది.
– పై రెండు షాక్‌ల ఫలితంగా ఒక్కో యూనిట్‌పై వినియోగదారునిపై గరిష్టంగా రూ.3 వరకు భారం మోపింది.
విద్యుత్ చార్జీల అదనపు భారాన్ని మోపిన కూటమి ప్రభుత్వ వైఖరికి నిరసనగా వైఎస్సార్‌సీపీ పోరుబాటకు సిద్ధమైంది. మొన్నటికి మొన్న రైతుల పక్షాన పోరాటం చేయగా, నేడు విద్యుత్ వినియోగదారుల తరఫున ఆందోళన చేయనుంది. ప్రజలతో కలిసి నాయకులు, కార్యకర్తలు ర్యాలీలు నిర్వహించి, ప్లకార్డులతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసి, విద్యుత్ కార్యాలయాల వద్ద నిరసన తెలియజేయనున్నారు. పెంచిన చార్జీలను తగ్గించాలని కోరుతూ నినదించనున్నారు. శుక్రవారం నియోజకవర్గాల వారీగా నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నారు. వైఎస్సార్ కూడళ్లు, ప్రధాన జంక్షన్ల నుంచి నిరసన ర్యాలీలు ప్రారంభించి, విద్యుత్ కార్యాలయాల వద్ద ధర్నా చేసి, చార్జీలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ అధికారులకు వినతి పత్రాలు అందజేయనున్నారు. నియోజకవర్గాల సమన్వయకర్తల ఆధ్వర్యంలో జరిగే నిరసన కార్యక్రమాలకు వైఎస్సార్‌సీపీ శ్రేణులు సమరోత్సాహంతో పాల్గోనున్నాయి.
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం:
బాబు మార్క్ మళ్లీ సుస్పష్టమైంది. మొన్నటికి మొన్న సర్దుబాటు పేరుతో ఓ సారి విద్యుత్ చార్జీలు పెంచారు. ఇప్పుడు అదనపు సర్దుబాటు పేరుతో మళ్లీ పెంచేందుకు సిద్ధమయ్యారు. ఐదేళ్ల పాటు విద్యుత్ చార్జీలు పెంచబోమని చెప్పి గద్దెనెక్కిన చంద్రబాబు అధికారంలోకి వచ్చిన ఆరు నెలలకే విద్యుత్ చార్జీలను రెండుసార్లు పెంచారు. నమ్మి ఓట్లేసినందుకు కరెంటు షాకిచ్చారు. ఇప్పటికే ఐదున్నర కోట్లకు పైగా అదనపు భారం పడింది. జనవరి, ఫిబ్రవరిలో ఇంకెంత భారం ఉంటుందో తెలియని పరిస్థితి నెలకొంది.
పెంపు ఇలా..
చంద్రబాబు అధికారంలోకి వచ్చేసరికి ఎల్‌టీ (డొమెస్టిక్) వినియోగదారుడు నెలకు 30 యూనిట్ల లోపు వరకు వినియోగిస్తే యూనిట్‌కు దాదాపు రూ.1.90 వసూలు చేశారు. కానీ, చంద్రబాబు వచ్చాక సర్దుబాటు పేరుతో ఇదే యూనిట్ చార్జీ రూ.3.20 వరకు పెంచగా, అదనపు సర్దుబాబు పేరుతో ఇదే యూనిట్ ధర దాదాపు రూ.4.70 వరకు పెరిగేలా నిర్ణయం తీసుకున్నారు. అదే 400 యూనిట్ల వరకు వినియోగదారుడికై తే చంద్రబాబు పెంచకముందు యూనిట్ ధర సుమారు రూ.9.75 కాగా తొలిసారి పెంపుతో రూ.12.30 వరకు పెరిగింది. ఇప్పుడు మళ్లీ యూనిట్ ధర దాదాపు రూ.15 వరకు పెరిగేలా వడ్డించారు.
చలికాలంలో తగ్గాలి కదా..
సాధారణంగా సెప్టెంబర్, అక్టోబర్ వరకు విద్యుత్ వినియోగం ఎక్కువగా ఉంటుంది. చలి ఎక్కువగా ఉండే నవంబర్, డిసెంబర్‌లో తక్కువ వినియోగం ఉంటుంది. ఎందుకంటే, ఏసీలు ఇతరత్రా వినియోగం తగ్గుతాయి. కానీ, చంద్రబాబు మాయతో నవంబర్, డిసెంబర్‌లో విద్యుత్ వినియోగం తగ్గినా కూడా బిల్లు పెరిగిన పరిస్థితి చోటు చేసుకుంది. చంద్రబాబు పెంచకముందు విద్యుత్ వినియోగం దృష్ట్యా అన్ని రకాల చార్జీలతో కలిపి నెలకు సరాసరి రూ.97.16 కోట్లు (గత ప్రభుత్వ హయాంలో డిమాండ్) వరకు డిమాండ్ ఉండేది. డిసెంబర్‌లో వచ్చే బిల్లులో అమాంతంగా రూ.102.62కోట్లకు డిమాండ్ చేరింది. ఇక జనవరిలో వచ్చే బిల్లులో రెండో సారి పెంచిన చార్జీలు జత కానున్నాయి. అప్పుడు ఇంకెంతకు డిమాండ్ చేరుతుందో అంచనా వేయలేని పరిస్థితి నెలకుంది.
సర్దుబాటు పేరుతో బుకాయింపు
తన ఆరు నెలల పాలనలో రెండుసార్లు విద్యుత్ చార్జీలు పెంచిన బాబు.. గత పాలకుల వల్లనే ఇలా పెంచాల్సి వచ్చిందని బుకాయిస్తున్నారు. జిల్లాలో శ్రీకాకుళం, పలాస, టెక్కలి డివిజన్ల పరిధిలో మొత్తం 7,88,078 విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. వీటిలో హెచ్‌టీ వినియోగదారులు కేవలం 477 మాత్రమే ఉండగా మిగిలినవారంతా ఎల్‌టీ వినియోగదారులే. చంద్రబాబు వీరికిచ్చిన షాక్‌లు ఇలా ఉన్నాయి.
వరుస షాక్‌లు..
ఒక వైపు విద్యుత్ చార్జీల పెంపు.. మరోవైపు నిత్యావసరాల వస్తువుల ధరల పెంపుతో సామాన్యులకు వరుస షాక్‌లు తగులుతున్నాయి. చాలీచాలని వేతనాలు, జీతాలతో నెట్టుకొస్తున్న వారికి చార్జీల పెంపు శిరోభారంగా మారింది. సామాన్యులకై తే కష్టతరంగా మారుతోంది. ఇస్తామన్న సంక్షేమ పథకాలను అమలు చేయకుండా చార్జీలను పెంచుకుపోతుండటంతో భరించలేకపోతున్నారు.
వరుసగా విద్యుత్ చార్జీల పెంపు
నిన్న సర్దుబాటు.. నేడు అదనపు సర్దుబాటు పేరుతో వడ్డన
– ఈ నెల బిల్లు నుంచే యూనిట్ విద్యుత్‌పై గరిష్టంగా రూ.3 అదనం
జిల్లాలో 7.88 లక్షల మంది వినియోగదారులపై భారం
బాబు బాదుడుపై నేడు వైఎస్సార్‌సీపీ పోరుబాట
చార్జీలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ జిల్లా వ్యాప్తంగా నిరసనలు
వరుసగా విద్యుత్ చార్జీల పెంపు
నిన్న సర్దుబాటు.. నేడు అదనపు సర్దుబాటు పేరుతో వడ్డన
ఈ నెల బిల్లు నుంచే యూనిట్ విద్యుత్‌పై గరిష్టంగా రూ.3 అదనం
జిల్లాలో 7.88 లక్షల మంది వినియోగదారులపై భారం
బాబు బాదుడుపై నేడు వైఎస్సార్‌సీపీ పోరుబాట
చార్జీలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ జిల్లా వ్యాప్తంగా నిరసనలు
Comments
Please login to add a commentAdd a comment