శ్రీకాకుళం పాతబస్టాండ్: రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎస్సీల జనాభా వారి వివరాలపై సోషల్ ఆడిట్ నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆయన తెలిపిన వివరాల మేరకు.. రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఉన్న ఎస్సీ కులగణ న వివరాలను డిసెంబర్ 26వ తేదీ గురువారం నుంచి గ్రామ వార్డు సచివాలయాల్లో ప్రదర్శించనున్నా రు. ఈ నెల 31వ తేదీ వరకు దీనిపై అభ్యంతరరాలు స్వీకరిస్తారు. తర్వాత జనవరి 6వ తేదీ వరకు అభ్యంతరాలను క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తారు. జనవరి 10న కులగణన తుది వివరాలను గ్రామ వార్డు సచివాలయాల్లో ప్రదర్శించాలి. పేరు, ఆధార్ నంబర్, పుట్టిన తేదీ, వయస్సు, ఉపకులం, మరుగుదొడ్డి సౌకర్యం, తాగునీటి సౌకర్యం, విద్యార్హత, వృత్తి, వ్యవసాయం ఇతర వివరాలను గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రదర్శిస్తారు. ఈ డేటాపై పౌరుల నుంచి వచ్చిన అభ్యంతరాలను వీఆర్వో పరిశీలించి వివరాలను ఆర్‌ఐకి నివేదిస్తారు. వీటిని ఆర్‌ఐ పునఃపరిశీలించి తహసీల్దార్‌కు రికమండ్ చేస్తారు. తర్వాత తహసీల్దార్ వీఆర్వో, ఆర్‌ఐల నివేదికలో వివరాలను పరిశీలించి, తుది ఆమోదం తెలి పి ఆ వివరాల్ని పోర్టల్‌లో పొందుపరుస్తారు. వివరాల్లో కచ్చితత్వాన్ని పెంపొందించేందుకు సహాయ సాంఘిక సంక్షేమ అధికారులతో 50 మంది వివరాల్ని ర్యాండమ్‌గా తనిఖీ చేయిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment