నేడు పాలవలస రైల్వే గేటు మూసివేత
సోంపేట: మండలంలోని పాలవలస రైల్వేస్టేషన్ వద్ద రైల్వేగేటుకు శనివారం మధ్యాహ్నం మరమ్మతులు చేపడుతున్నట్లు రైల్వే సెక్షన్ ఇంజినీర్ బీకే శెట్టి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. మరమ్మతుల కారణంగా శనివారం మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రైల్వే గేటు మూసి వేస్తున్న ట్లు పేర్కొన్నారు. ప్రయాణికులు, వాహనదారులు విషయాన్ని గమనించాలని కోరారు.
అగ్నివీర్ వాయు ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం
శ్రీకాకుళం న్యూకాలనీ: భారత వాయుసేన అగ్నివీర్ వాయు ఉద్యోగాలకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులను ఆహ్వానించిందని సెట్‌శ్రీ సీఈఓ బీవీ ప్రసాదరావు తెలిపారు. 2025 జనవరి 7 నుంచి 27వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా అగ్నిపథ్‌వాయు.సీడీఏసీ.ఇన్ వెబ్‌పోర్టల్‌లో దరఖాస్తులను స్వీకరించడం జరుగుతుందన్నారు. టెన్త్/ఇంటర్‌లో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించిన పురుష, మహిళా అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
మాజీ ప్రధానికి నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు శ్రద్ధాంజలి ఘటిస్తూ.. పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ గాంధీనగర్‌కు చెందిన ప్రముఖ సూక్ష్మ శిల్పి కొత్తపల్లి రమేష్ ఆచారి చాక్ పీస్‌పై ఆయన ప్రతిరూపం అద్భుతంగా చెక్కారు. మూడు గంటల పాటు కష్టపడి ఈ ఆకృతిని తీర్చిదిద్దారు. – కాశీబుగ్గ
సైకత నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ మృతికి సైకతశిల్పి గేదెల హరికృష్ణ సైకత నివాళులర్పించారు. గాజులకొల్లివలసలోని సంగమేశ్వరస్వామి ఆలయ ఆవరణలో మన్మోహన్ సింగ్ సైకత శిల్పాన్ని రూపొందించారు.
– ఆమదాలవలస
Comments
Please login to add a commentAdd a comment