పాఠశాలల అభివృద్ధికి బాసటగా నిలవాలి
శ్రీకాకుళం న్యూకాలనీ: విద్యారంగంలో కీలకంగా ఉండే పాఠశాలల సమగ్రాభివృద్ధిలో స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీ భాగస్వాములు కావాలని సమగ్రశిక్ష ఏపీసీ డాక్టర్ సంపతిరావు శశిభూషణ్ కోరారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలలో ఇటీవలి ఎన్నికై న యాజమాన్య కమిటి సభ్యులకు శుక్రవారం శ్రీకాకుళం మండల పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో శిక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాల యాజమాన్య కమిటీలు, ఉపాధ్యాయులు సమన్వయంతో పని చేస్తేనే ప్రభుత్వ లక్ష్యాలు నెరవేరుతాయన్నారు. ఇటీవల కాలంలో పాఠశాలల ప్రాంగణాలను అసాంఘిక శక్తులు నాశనం చేస్తున్నాయన్నారు. మత్తుపదార్థాలు సేవించే పరిస్థితులు ఏర్పడుతున్నందున వాటి నిర్మూలనకు కలిసికట్టుగా పోరాడాలన్నారు. అనంతరం ‘మత్తుపదార్థాల నిర్మూలన’నకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో మండల పరిషత్, విద్యాశాఖ, సమగ్రశిక్ష సెక్టోరియల్ అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment