బద్దకం వదిలేద్దాం..
పనా.. ఇప్పుడు కాదు తర్వాత చేద్దాం.. అన్న ఆలోచనకు పాత ఏడాదిలోనే సమాధి కట్టేయాలి. కష్టమవుతుంది.. అంత పనిచేయలేను అనే మా టలు పక్కన పెట్టి అనుకుంటే సాధించలేనిది ఉండదు. ఎంతటి పనై నా చేసేద్దామనే సంక ల్పం ఉండాలి. చరి త్రను చూస్తే ఎన్నో విజ య గాథలు ఉన్నాయి.
నూతన ఏడాది అనగానే ప్రతి ఒక్కరిలో కొత్త ఆలోచనలు, కొంగొత్త ఆకాంక్షలు మెదులుతాయి. ఇబ్బంది పెడుతున్న పాత అలవాట్లను వదిలించుకోవాలని భావించే వారు కొందరైతే.. కొత్త విధానాలను అవలంబించాలని నిర్ణయించుకునే వా రు మరికొందరు. సాదాసీదాగా సాగిపోతున్న జీవితంలో నూతన సంవత్సరం నుంచి మరింత జోష్ నింపాలని అనుకుంటారు. తమకంటూ ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకోవడం న్యూ ఇయర్ నుంచే ప్రారంభిస్తారు. ముందస్తు ప్రణాళికను రచించుకుని పకడ్బందీగా అమలు చేస్తూ గమ్యం వైపు సాగుతుంటారు.
కాలం కొలిమిలో మరో ఏడాది కరిగిపోయింది. కాలగమన చక్రంలో నూతన వత్సరం వచ్చేసింది. కొత్త ఆశలు, సరికొత్త ఆశయాలతో నూతన సంవత్సరానికి అంతా స్వాగతం పలుకుతున్నారు. గత కాలపు తప్పులను సమీక్షించుకుంటూ కొందరు.. రానున్న రోజులకు లక్ష్యాలను నిర్దేశించుకుంటూ మరికొందరు.. కొత్త ఏడాదికి వెల్‌కమ్ చెబుతున్నారు. జిల్లాలో 31 అర్ధరాత్రి హంగామా ఆకాశాన్నంటింది. కేక్‌లు కట్ చేసి వీధుల్లో చిందులేసి సంబరం చేసుకున్నారు. – సాక్షి ప్రతినిధి,
శ్రీకాకుళం
కొత్త ఏడాదిపై కోటి ఆశలు
నూతన ఆశయాలతో ముందుకు
జిల్లా వ్యాప్తంగా న్యూఇయర్ జోష్
ఘనంగా వేడుకలు
Comments
Please login to add a commentAdd a comment