మున్సిపల్ ఇంజినీరింగ్ కార్మికుల ధర్నా
శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): మున్సిపల్ ఇంజినీరింగ్ కార్మికులకు జీఓ 36 ప్రకారం వేతనాలు చెల్లించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు సీహెచ్.అమ్మన్నాయుడు, శ్రీకాకుళం నగర కన్వీనర్ ఆర్.ప్రకాశరావు, ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్.బలరాం, ఇంజినీరింగ్ విభాగం జిల్లా కన్వీనర్ రాణా శ్రీనివాసరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద ఏపీ మున్సిపల్ వర్కర్స్–ఎంప్లాయిస్ ఫెడరేషన్ సీఐటీయూ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులు ధర్నా చేపట్టారు. అనంతరం కార్పొరేషన్ కమిషనర్ పి.వి.వి.డి. ప్రసాదరావుకు వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో ఇంజినీరింగ్ విభాగం అధ్యక్షులు పి.త్రినాథరావు, పి.మణికంఠ, ఆర్.గిరిజాశంకర్, పేట.శ్రీకాంత్, ఆర్.రమేష్ బాబు, పి.సోమేష్, పి.శాంతి, ఎస్.సురేష్, ఎం.శ్రీనివాసరెడ్డి, గొండు ఆదినారాయణ, ఎం.ఎస్.రాములు, చిన్నమడు, జి.లక్ష్మి, జయమ్మ మంగమ్మ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment