మహిళాభ్యున్నతికి సావిత్రిబాయి పూలే కృషి వెలకట్టలేనిది
శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): భారతదేశపు తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే మహిళల అభ్యున్నతికి చేసిన కృషి వెలకట్టలేనిదని వైఎస్సార్‌సీపీ కళింగ కుల రాష్ట్ర అధ్యక్షుడు దుంపల రామారావు (లక్ష్మణరావు) అన్నారు. శ్రీకాకుళం నగరంలో ఓ ప్రయివేటు కార్యాలయంలో శుక్రవారం సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా లక్ష్మణరావు మాట్లాడుతూ విద్య ద్వారానే సీ్త్రకి విముక్తి లభిస్తుందనే దృఢ సంకల్పంతో బాలికా విద్య ఉద్యమానికి పునాది వేసిన గొప్ప సంఘ సంస్కర్త సావిత్రీబాయి పూలే అని కొనియాడారు. మహిళలు ఆమెను స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ సనపల నారాయణరావు, గరికయ్య, తిర్లంగి లోకనాథం, టి.శంకరరావు, రౌతు గోవిందరావు, భోగ పాపన్నయాదవ్, తమిరి శంకరరావు, సనపల రామకృష్ణ, అంధవవరపు శ్రీనివాసరావు, మున్సీ, కై న చిన్నారావు, గురుగుబెల్లి పెంటన్నాయుడు, కూన పాపారావు, డి.గోవిందరావు,డి. ధర్మారావు, సింహాచలం గౌడ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment