సమగ్ర వ్యవసాయ పద్ధతి..
ఎకరా భూమిలో ఏడాదికి లక్ష రూపాయలు ఆదాయం సమకూర్చుకునే రైతు ఈ ప్రాజెక్ట్ ద్వారా ఏడాదికి మూడు రూ.లక్షల వరకు ఆదాయం పెంచుకోవచ్చని ఎచ్చెర్ల మండలం సంతసీతారాంపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఎ.దమయంతి, బి.శరణ్యశ్రీ నిరూపించారు. హెచ్‌ఎం జయలక్ష్మి, గైడ్ టీచర్ బి.అనూరాధ ప్రోత్సాహంతో ఈ ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టారు. సమీకృత వ్యవసాయం ద్వారా రైతులు అనేక రకాల పంటలను ఒకే చోట పండిస్తే తుఫానులు, వర్షాల సమయంలో కొన్ని పంటలు పాడైనా మిగిలిన పంటలను రక్షించుకోవచ్చని ప్రాజెక్ట్‌తో తెలియజేశారు. ఎక్కువ మందికి ఉపాధి కల్పించే అవకాశం ఉండటం, యూత్‌ని కూడా ఆకర్షిస్తుందని తెలిపే ఈ ప్రాజెక్టు.. ‘స్టూడెంట్ గ్రూపు కేటగిరి’లో ద్వితీయ స్థానంలో నిలిచి రాష్ట్ర పోటీలకు ఎంపికై ంది.
Comments
Please login to add a commentAdd a comment