● పరారైన నేరస్తుడి కోసం గాలింపు
ఎచ్చెర్ల క్యాంపస్: జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న ఓ పోలీస్ స్టేషన్ నుంచి గత నెల 31వ తేదీన తప్పించుకున్న పాత నేరస్తుడు, జిల్లాలో పలు చోరీలతో సంబంధం ఉన్న పున్నాన రాంబాబు ఆచూకీ కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. తప్పించుకొని ఐదు రోజులు అవుతున్న నేపథ్యంలో ఇతర రాష్ట్రాలకు వెళ్లే అవకాశం ఉందన్న కోణంలో అన్వేషిస్తున్నారు. పదుల సంఖ్యలో దొంగతనాల కేసుల్లో ఇతను నిందితుడు. ఇతడిని పట్టుకుంటేనే చాలా కేసులకు ముగింపు లభిస్తుంది. తూర్పుగోదావరి జిల్లాలోని ఈ వ్యక్తి నివాస ప్రాంతంలోని కుటుంబ సభ్యులు ఇళ్లు, ప్రేయసి ఇళ్లను సైతం పరిశీలించారు.
ఫోన్ వాడడు..
ఈ నేరస్తుడు నటనలో, సాంకేతిక పరిజ్ఞానంలో మంచి నైపుణ్యం ఉన్న వ్యక్తిగా సమాచారం. ముందుగా విజయవాడ చేరడం, అక్కడి నుంచి నచ్చిన ప్రాంతం ఎంచుకోవటం గతంతో చేసేవాడు. పాలిటెక్నిక్ డిప్లమా చేసిన రాంబాబుకు టెక్నాలజీపై మంచి పట్టు ఉంది. ఇతను ఫోన్ వాడడు. ఫోన్ వాడితే లైవ్ లోకేషన్ పరంగా దొరికే అవకాశం ఉంది. మరో పక్క కొన్ని రాష్ట్రాల్లో క్లబ్ క్రికెటర్లు, బెట్టింగ్ గ్రూపులతో సంబంధం ఉంది. తనకు కావాల్సిన వారితో మరొకరి ఫోన్ ద్వారా మాట్లాడతాడు. దొంగతనా లు చేసేటప్పుడు సైతం బైక్‌లపై తిరిగి తాళాలు వేసి ఉన్న ఇళ్లు లక్ష్యంగా చోరీలు చేస్తాడు. పదుల సంఖ్యలో చోరీలతో సంబంధం ఉన్న ఈ వ్యక్తిని పోలీసులు అతి కష్టం మీద అదుపులోకి తీసుకున్నా రు. అనంతరం విచారణ చివరి దశకు చేరిన సమయంలో స్టేషన్ నుంచి తప్పించుకోవటం పోలీస్ వర్గాలకు సైతం మింగుడు పడటం లేదు.
మహా మాయగాడెక్కడ?
Comments
Please login to add a commentAdd a comment