దాతల హాజరు సాధ్యమేనా?రథ సప్తమికి డోనర్ పాసులపై అయోమయం
శ్రీకాకుళం కల్చరల్,గార: సుప్రభాతపు పరిమళాలు వీధివీధినా వెదజల్లాలి. స్వామి కీర్తనల మధురిమ లు ఊరంతా వినిపించాలి. ధనుర్మాసపు వేకువలన్నీ సుస్వర భరితమై విరాజిల్లాలి. ఇవన్నీ జరగాలంటే మేలుకొలుపు ఒకటి వినిపించాలి. ఆ కొ లుపుతోనూ ఊరు నిద్ర లేవాలి. ఎన్నో ఏళ్లుగా వస్తున్న ఈ సత్సంప్రదాయం ఇప్పుడు కూడా కొనసాగుతోంది. జిల్లా కేంద్రంలో అయితే దాదాపు 15 వరకు భజన బృందాలు ఉన్నాయి. ధనుర్మాసం సందర్భంగా నెల రోజుల పాటు వీధుల్లో, గ్రామా ల్లో తెల్లవారు జామునే కీర్తనలు ఆలపిస్తూ తిరుగుతూ భక్తులు ఇచ్చే బియ్యం, వస్తువులు, డబ్బులను స్వీకరిస్తారు. వాటిని ఒక రోజున ఉచితంగా అన్నప్రసాద వితరణ, మిగిలిన దానితో సంబంధిత ఆలయ అభివృద్ధికి ఖర్చు చేస్తున్నారు. బలగ హరేరామమందిరం ఆధ్వర్యంలో యాభై ఏళ్లుగా మేలుకొలుపులు పాడుతున్నారు. భీమేశ్వర భజన మండలి వారు 27 ఏళ్లుగా ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. కలెక్టర్ బంగ్లా ఎదురుగా ఉన్న శ్రీదేవి, భూదేవి సమేత కల్యాణ వేంకటేశ్వరస్వామి దేవాలయం కేంద్రంగా 13 ఏళ్లుగా మేలు కొలుపు ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. శ్రీకూర్మంలో నూ మూడు దశాబ్దాలుగా క్రతువు జరు గుతోంది. భక్తులు సమర్పించిన బియ్యం, పప్పు దినుసులు డబ్బులతో భీష్మ ఏకాదశి నాడు అన్నప్రసాదం అందిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment