టెక్కలి: రానున్న పదో తరగతి పరీక్షలకు విద్యార్థులు పక్కా ప్రణాళికతో సన్నద్ధం కావాలని జిల్లా విద్యా శాఖాధికారి ఎస్.తిరుమలచైతన్య అన్నారు. శనివారం టెక్కలి మండలం చాకిపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల పరిసరాలతో పాటు విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించారు. ప్రాథమిక స్థాయి విద్యార్థులతో వివిధ రకాల కథలను రాయించారు. అనంతరం మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించారు. ఆయనతో పాటు ఉప విద్యా శాఖాధికారి పి.విలియమ్స్, డైట్ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ భారతి, పాఠశాల ఇన్‌చార్జి ప్రధానోపాధ్యాయుడు పి.జగదీశ్వర్రావు, ఉపాధ్యాయులు కె.నారాయణరావు, పి.చిన్నారావు, బి.ఆనందరావు, ఆర్.జ్యోతి, కె.సుధారాణి, సిహెచ్.భారతి, తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment