భారీగా వెండి పట్టివేత
రణస్థలం: మండలంలోని పైడిభీమవరం చెక్‌పోస్టు వద్ద చేపట్టిన వాహన తనిఖీలో 14 కిలోల వెండిని జేఆర్ పురం ఎస్‌ఐ ఎస్.చిరంజీవి పట్టుకున్నారు. ఎస్‌ఐ చిరంజీవి తెలిపిన వివరాలు ప్రకారం.. ఆదివారం మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో ఆర్టీసీ బస్సు తనిఖీ చేయగా బరంపురానికి చెందిన పుష్పేంద్ర సింగ్ వద్ద సుమారు 14 కిలోల వెండి పట్టీలు, చైన్లు వంటివి గుర్తించారు. వెంటనే జేఆర్ పురం పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చి జీఎస్‌టీ ఆధికారులకు సమాచారం అందించారు. నిందితుడు బరంపురం నుంచి శ్రీకాకుళం వచ్చి అక్కడి నుంచి విజయనగరం వెళుతుండగా పైడిభీమవరం వద్ద తనిఖీలో పట్టుకున్నారు. జిల్లా జీఎస్‌టీ అసిస్టెంట్ కమిషనర్ సీహెచ్ కొండమ్మ వచ్చి పరిశీలించగా వెండికి సంబంధించిన బిల్లులు ఉన్నాయి. అయితే విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నంలోని బంగా రం దుకాణదారుల నుంచి ముందస్తు ఆర్డర్ లేకుండా భారీ మొత్తంలో వెండి తీసుకురావడం చట్టరీత్యా నేరమని గుర్తించారు. దీనిపై జీఎస్‌టీ అధికారిణి కొండమ్మ మాట్లాడుతూ బిల్లులు ఉన్నా బంగారం దుకాణారుల నుంచి ఆర్డర్లు లేనందున పూర్తి స్థాయి వెండిని లెక్కించి ఆపరాధ రుసుం విదిస్తున్నట్లు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment