సర్వేశ్వరా ఇదేం తీరు..!
కార్గో కార్చిచ్చుఉద్దానంలో కార్గో కార్చిచ్చు అంటుకుంటోంది. గ్రామాలు ఉద్యమం వైపు నడుస్తున్నాయి. –8లో
సగం సర్వే అప్పుడే పూర్తి..
జిల్లాలోని 30 మండలాల్లో 1465 రెవెన్యూ గ్రామాలు ఉండగా వీటిలో గత ప్రభు త్వం హయాంలో 738 గ్రామాల్లో శాసీ్త్రయంగా ఆధునిక పరికరాలు ఉపయోగించి కచ్చితమైన రీ సర్వే చేశారు. పొలాల హద్దులకు కూడా ప్రభుత్వ నిధులతోనే సరిహద్దు రాళ్లు వేయించారు. సర్వే నంబర్లతో పాటు ప్రతి భూ కమతానికి ఒక యూనిక్ కోడ్ (ఎల్‌పీ నంబర్)ను ఇచ్చి భూ వివాదాలకు తావు లేకుండా స్పష్టమైన సర్వేను చేయించారు. ఆ ప్రభుత్వం హయాంలోనే సగానికి పైగా రెవెన్యూ గ్రామాలు సర్వేలు పూర్తి చేయడం జరిగింది.
ఇటీవల విజయవాడలో కలెక్టర్ల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రీ సర్వేను నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలెక్టర్లను ఆదేశించారు. అప్పుడే వారంతా నివ్వెరపోయారు. ఒకప్పుడు సర్వే ఆపాల్సిందేనని ఆందోళన చేసిన వ్యక్తి మళ్లీ మాట మార్చడంపై ఆశ్చర్యపోయారు. మన జిల్లాలో పైలెట్ ప్రాజెక్టుగా 25 మండలాల్లో మండలానికి ఒక రెవెన్యూ గ్రామం వంతున సర్వేలు నిర్వహిస్తున్నారు. వీటిని ఫిబ్రవరి నెలాఖరుకి పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యం నిర్దేశించింది.
● భూముల సర్వేపై నాడు అభాండాలు మోపిన టీడీపీ
● నేడు మళ్లీ రీసర్వే ప్రారంభించిన వైనం
● జిల్లాలో 25 గ్రామాల్లో జరుగుతున్న రీ సర్వే
● ఫిబ్రవరి 16 నాటికి పూర్తి చేయాలని నిర్ణయం
శ్రీకాకుళం పాతబస్టాండ్:
ఎన్నికల సమయంలో టీడీపీ ప్రచారాలు ఉత్తి అబద్ధాలేనని కూటమి ప్రభుత్వ కార్యకలాపాలు రుజువు చేస్తున్నాయి. భూముల రీ సర్వేపై ఎన్నికల ముందు కళ్లలో నిప్పులు పోసుకున్న టీడీపీ నాయ కులు ఇప్పుడు అదే సర్వేను మళ్లీ నిర్వహిస్తున్నారు. నాడు రీ సర్వే వల్ల రైతులకు నష్టం జరిగిపోతోందంటూ ఊరూరా నమ్మబలికిన నాయకులు నేడు ఏ మాత్రం మొహమాట పడకుండా ఆ సర్వేలను కొనసాగిస్తున్నారు. మాట మార్చడం, అబద్ధాలు చెప్ప డం కూటమి ప్రభుత్వం నైజమని ఈ తీరు స్పష్టం చేస్తోంది.
సమస్యలకు చెక్ పెట్టేందుకే..
రీ సర్వే భూ సమస్యల వివాదాలకు చెక్ పెట్టే పెద్ద కార్యక్రమం. ఈ మహత్తర కార్యక్రమాన్ని మూడేళ్ల కిందట నాటి సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి రాష్ట్రంలో మొదలుపెట్టారు. సుమారు వందేళ్లుగా సర్వేలకు నోచుకోని భూముల వల్ల మొదలైన వివాదాలకు ముగింపు పలకాలని సర్వేకు శ్రీకారం చుట్టారు. భూముల సమగ్ర సర్వే, సరిహద్దు రాళ్లు ప్రభుత్వ ధనంతో ఏర్పాటు చేసే ప్రక్రియను ప్రారంభించారు. కానీ నాటి ప్రతిపక్షం టీడీపీ ఈ కార్యక్రమంపై లేనిపోని అభాండాలు మోపింది. జనాలకు పదే పదే అబద్ధాలు నూరిపోసింది. ఇప్పుడు అధికారంలోకి రాగానే ఆ రీ సర్వేను మరలా ప్రారంభించింది. అప్పుడే జిల్లాలో కొన్ని మండలాల్లో ప్రాజెక్టు సర్వే పేరిట సర్వేలు ప్రారంబించింది. ఈ తొలివిడత సర్వేలు ఫిబ్రవరి నెలాఖరు నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా తీసుకుంది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పాత ఎఫ్‌ఎంబీలు ఆధారంగా భూములు సర్వేలు చేయించి, వారి హద్దులు నిర్ణయించి, ప్రతి విస్తీర్ణానికి విధానాలు పాటిస్తూ సర్వే చేశారు. సరిగ్గా నేటి పాలకులు కూడా అదే విధానాన్ని ఫాలో అవుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment