11న రథసప్తమి పనులకు టెండర్లు
అరసవల్లి: వచ్చే నెల 2, 3, 4వ తేదిల్లో జరగనున్న రథసప్తమి మహోత్సవానికి సంబంధించి పలు పనులకు టెండర్లు ఆహ్వానిస్తున్నట్లు అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయం ఈవో వై.భద్రాజీ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 11న ఆలయ మండపాల్లో షార్టు సీల్డ్, బహిరంగ టెండర్ నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి గలవారికి ఆలయ కార్యాలయంలో ఈ నెల 8 నుంచి దరఖాస్తులు(టెండర్ షెడ్యూల్) అందజేస్తామని.. వీటిని కార్యాలయంలో సమర్పించిన వారు ఈ నెల 11వ తేదీ ఉదయం 11 గంటల నుంచి జరిగే టెండర్ ప్రక్రియలో పాల్గొనే అవకాశముంటుందని వివరించారు. విద్యుత్ అలంకరణ, క్యూలైన్ల ఏర్పాట్లు, షామియానాలు, కార్పెట్లు వేయడం, ఆలయ పరిసరాల్లో రంగులు వేయడం, ఫొటోలు, వీడియోగ్రఫీ, ఎల్‌ఈడీ స్క్రీన్స్, సీసీ కెమెరాల ఏర్పాటుతో పాటు డ్యూటీ సిబ్బందికి టీ,టిఫిన్, భోజనాలు సమకూర్చే హక్కులకు గాను టెండర్లు పిలుస్తున్నట్లు పేర్కొన్నారు.
8వ తేదీ దేహదారుఢ్య
పరీక్షలు 11కి వాయిదా
శ్రీకాకుళం క్రైమ్ : ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవెల్ రిక్రూట్‌మెంట్ బోర్డు షెడ్యూల్ అనుసరించి జిల్లాలో ఈ నెల 8న జరగాల్సిన పోలీస్ కానిస్టేబుల్ దేహదారుఢ్య పరీక్షలు వైకుంఠ ఏకాదశి, ఇతర శాంతిభద్రతల దృష్ట్యా 11వ తేదీకి వాయిదా వేశారు. ఈ మేరకు ఎస్పీ మహేశ్వరరెడ్డి ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. మిగిలిన తేదీల్లో పరీక్షలు యథావిధిగా జరుగుతాయని ఎస్పీ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment