అవిసిపోయింది ప్రాణం
కాశీబుగ్గ: నిరుపేద కుటుంబం.. యజమానికి కిడ్నీ వ్యాధి.. అర్ధాయువులోనే చావు. ఉద్దానంలో దశాబ్దాలుగా ఈ కథ కొనసాగుతోంది. తాజాగా పలాస మండలం బొడ్డపాడు గ్రామానికి చెందిన గేదెల అప్పారావు(58) అనే వ్యక్తి కిడ్నీ వ్యాధితో పోరాడుతూ మంగళవారం ఉదయం మరణించారు. అప్పారావుకు చాలా ఏళ్లుగా కి డ్నీ సమస్య వేధిస్తోంది. ఆయనకు ఇద్దరు కు మార్తెలు ఉండడంతో ఎలాగైనా వారికి వివా హం చేసి ఓ ఆధారం చూపించాలని ఆయన తపనపడ్డారు. చిన్న కుమార్తె పెళ్లి అయ్యాక.. ఆయన కన్నుమూశారు. నెల రోజుల కిందటే ఈ వివాహం జరిగింది. వారానికి రెండుసార్లు ఆయన డయాలసిస్ చేయించుకునేవారు. బొడ్డపాడు యువజన సంఘంలో అధ్యక్షులుగా, కార్యదర్శిగా పనిచేశారు. మంచి కళాకారుడు కూడా. వారం కిందటే ఉద్దానం రచయితల సంఘం ఆధ్వర్యంలో ఆయనకు ‘కామ్రేడ్ తాతారావు స్మారక పురస్కారం’ అందజేశారు. ఆయన మృతితో స్థానికంగా విషాద ఛాయలు అలముకున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment