● రంగోత్సవం
ఆకట్టుకున్న రంగవల్లులు
శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో రంగోత్సవాలు ఉత్సాహంగా సాగాయి. శ్రీకాకుళం నగరంలోని ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల వేదికగా మంగళవారం జరిగిన ఈ పోటీల్లో జిల్లా నలుమూలల నుంచి వివిధ యాజమాన్య పాఠశాలలు, కళాశాలల నుంచి 6 నుంచి ఇంటర్ వరకు చదువుతున్న 250 మంది విద్యార్థులు పాల్గొన్నారు. క్విజ్, చిత్రలేఖనం, చేతిరాత, సంప్రదాయ జానప ద నృత్యం, డిజిటల్ పోస్టర్ తయారీ, నినాదాల తయారీ, రోల్‌ప్లే తదితర అంశాలలో పోటీలు జరిగాయి. కార్యక్రమంలో డీఈఓ డాక్టర్ ఎస్.తిరుమల చైతన్య, డీవైఈఓ ఆర్.విజయకుమారి, ఎ.గౌరీశంకర్, సీనియర్ అధ్యాపకులు ఎం.భారతమ్మ, జీవీ రమణ, ఎ.వేణుగోపాల్, లీలామోహన్, వైవీఏ నాయుడు, కె.అప్పన్న పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment