435 మద్యం సీసాలు స్వాధీనం
జి.సిగడాం: మండలం బాతువ గ్రామానికి చెందిన కలిశెట్టి పైడిరాజు అక్రమంగా తరలిస్తున్న మద్యం సీసాలను జి.సిగడాం పోలీసులు మంగళవారం పట్టుకున్నారు. నడిమివలస కూడలి వద్ద ఏఎస్‌ఐలు కోరుకొండ రామకృష్ణ, పొగిరి శంకరరావులు వా హనాల తనిఖీ చేస్తుండగా జి.సిగడాం నుంచి బాతువ వైపు వెళ్తున్న బైక్‌ను తనిఖీ చేశారు. ఆయన దగ్గర 435 మద్యం సీసాలను స్వాధీనం చేసుకుని పైడిరాజును అదుపులో తీసుకున్నామని ఏఎస్‌ఐలు తెలిపారు.
ఉద్యోగాల తొలగింపుపై నేడు విచారణ
ఎచ్చెర్ల క్యాంపస్: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయంలో తొలగించిన 34 మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు తమను అన్యాయంగా తీసేశారని ఈ నెల రెండో తేదీన అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు మంగళవారం సంబంధిత పార్టీలకు నోటీసులు జారీ చేశారు. బుధవారం లేబర్ కమిషన్ కార్యాలయానికి హాజరు కావాలని వీసీ రజిని, రిజిస్ట్రార్ సుజాత, ఏజీఎస్ మేనేజ్ మెంట్ సర్వీస్ (గుంటూరు జిల్లా తాడేపల్లి)కి చెందిన కంట్రోలర్ రూపేష్‌బాబులకు నోటీసులు జారీ చేశారు. గతంలో సైతం వేతనాలు అందజేయలేదని ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు లేబర్ కమిషన్ కార్యాలయంలో ఫిర్యాదు చేయటంతో వేతనాలు చెల్లించారు. మూడేళ్ల పాటు ఏజెన్సీ కాంట్రాక్ట్ ఉందని, ఈ నిబంధనలు పాటించకుండా గత నెల 31న తొలగించారని, ఏడాది పనికి 11 నెలలు మాత్రమే వేతనాలు చెల్లించారని, ఈ నెల 1వ తేదీ నుంచి విధులకు హాజరు కాకుండా అడ్డుకుంటున్నారని, ఎలాంటి ముందుస్తు నోటీస్ లేకుండా కక్షతో తొలగించారని తెలిపారు. ఈ మేరకు అధికారులు, ఔ ట్ సోర్సింగ్ ఏజెన్సీ వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. హాజరు కాకుంటే చట్ట పరంగా చర్యలు తీసుకుంటామని నోటీస్‌లో అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ పేర్కొన్నారు.
డిసెంబర్ నెల వేతనం చెల్లింపు
వర్సిటీ అధికారులు డిసెంబర్ నెల ఔట్ సోర్సింగ్ 34 మంది ఉద్యోగులకు మంగళవారం వేతనాలు చెల్లించారు. వర్సిటీ అధికారులు ఏజీఎస్ మేనేజ్ మెంట్ సర్వీసెస్‌కు చెల్లించగా, వారు ఉద్యోగుల ఖాతాల్లో నిబంధనలు మేరకు జమ చేశారు. ఔట్ సోర్సింగ్ ఏజెన్సీ రద్దు చేసినట్లు వర్సిటీ అధికారులు గతంలో ప్రకటించారు. రద్దు చేసిన ఏజెన్సీ నుంచి వే తనం చెల్లించటం గమనార్హం.
రెండు జిల్లాల సరిహద్దు భూముల పరిశీలిన
జి.సిగడాం: జి.సిగడాం మండలం గొబ్బూరు గ్రామం, విజయనగరం జిల్లా రాజాం మండలం పొగిరి పంచాయతీ బొడ్డవలస గ్రామాల సరిహద్దులో ఉన్న భూములను మంగళవారం శ్రీకాకుళం రెవెన్యూ డివిజనల్ సర్వే పరిశీలకులు అనుపోజు వెంకటేశ్వరరావు, మండల సర్వేయర్ శాంతారావు మొయ్యి ఈశ్వరరావు, ఆర్‌ఐ రాధ, వీఆర్‌ఓ లక్ష్మణరావు కలిసి పరిశీలించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో మాట్లాడుతూ రైతుల సమస్యలను పరిష్కారం చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతుందన్నారు. రీ సర్వే చేసిన గ్రామాల్లో ఎక్కడైనా తప్పులు ఉంటే వాటి పరిష్కారం కోసం రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ మహదాస్యం చిన్నారావు, కార్యదర్శి ధర్మవరపు సతీష్ లతోపాటు సిబ్బంది ఉన్నారు.
మరో ఐదు రోజులు గడువు పొడిగింపు
శ్రీకాకుళం పాతబస్టాండ్ : ఎస్సీ కుల గణనపై అభ్యంతరాల స్వీకరణ గడువును ఈ నెల 12వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. డిసెంబరు 31తోనే గడువు పూర్తయినా ఈనెల 7 వరకు ఒకమారు పొడిగించారని, మళ్లీ ఇప్పుడు రెండోసారి ఐదురోజులు పొడిగించినట్లు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసిందని అన్నారు.
భూములను పరిశీలిస్తున్న వెంకటేశ్వరరావు
Comments
Please login to add a commentAdd a comment