●
పండగ రోజుల్లో పొట్టేళ్లకు భలే గిరాకీ నెలకొంది. కొల్లివలస సంతలో పొట్టేళ్లు కొనేందుకు మంగళవారం జనం ఎగబడ్డారు. పొట్టేళ్లు, గొర్రెలు, మేకల ధరలు ఆకాశాన్ని అంటాయి. 20 కిలోల గొర్రెపోతు రూ.20వేల వరకు ధర పలుకుతోంది. మేకపోతు ధరలు కూడా దాదాపు అలాగే ఉన్నాయి. నాటుకోళ్ల రేట్లు రోజురోజుకూ పెరుగుతున్నాయి. –బూర్జ
సంతలో మేకపోతులు మంచి ధర పలుకుతున్నాయి. 20 కిలోల మేక రూ.20వేలపైనే పలుకుతోంది. సంక్రాంతి ముందు వారం కావడంతో పొట్టేళ్లకు గిరాకీ నెలకొంది.
– బొడ్డ నీలయ్య,
చీడివలస గ్రామం,
అమ్మకందారు
Comments
Please login to add a commentAdd a comment