అర్ధరాత్రి.. కోర్టులోకి దూరి
శ్రీకాకుళం క్రైమ్ : దొంగలు రెచ్చిపోతున్నారు. కోర్టు అన్న భయం కూడా లేకుండా ఏకంగా బార్ అసోసియేషన్ భవనంలోకి జొరబడి చోరీకి పాల్పడ్డారు. రాత్రి పూట జనాల అలికిడి ఉండే ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదురుగా ఈ దొంగతనం జరగడం గమనార్హం. జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ కాంప్లెక్సు ఎదురుగా ఉన్న న్యాయస్థానం ఆవరణలో సోమవారం అర్ధరాత్రి చోరీ జరిగింది. రెండో పట్టణ సీఐ ఈశ్వరరావు తెలిపిన వివరాల మేరకు.. న్యాయస్థానం ఆవరణలో ఉన్న బార్ అసోసియేషన్ భవనంలో అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు చొరబడి టీవీ దొంగిలించారు. అక్కడితో ఆగకుండా పక్కనే ఉన్న టీస్టాల్ కౌంటర్‌లో రూ. 3 వేల నగదును సైతం కాజేశారు. మంగళవారం ఉదయం సమాచారం అందుకున్న పోలీసులు, క్లూస్ టీమ్ చేరి వేలిముద్రలు సేకరించామని, జిల్లా బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పి.చంద్రశేఖర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment