ఫలితాలే నిదర్శనం
పేరులోనే కాదు తీరులోనూ ఆ బడి ఆదర్శవంతంగా నిలుస్తోంది. పుస్తకాల బరువులతో పిల్లలు కుంగిపోకుండా గురువులు సృజనాత్మక విషయాలు బోధిస్తున్నారు. కేవలం ర్యాంకుల వెంబడి పరిగెత్తకుండా చదువుకు సరదాను జోడిస్తున్నారు. విద్యుత్ పొదుపుపై గురువులు, పిల్లలు కలిపి ఏకంగా షార్ట్ ఫిల్మ్ తీసి స్టేట్ ఫస్ట్ ప్రైజ్ కొట్టారు. ఏటా అత్యుత్తమ ఉత్తీర్ణత సాధిస్తూ ముందుకెళ్తున్నారు.
ఉపాధ్యాయుల కృషితోనే..
మేము విద్యతోపాటు చిన్న చిన్న లఘుచిత్రాలను తీసేందుకు మా ఉపాధ్యాయులు సహకరించారు. వారి కృషితో పవర్ ప్రేమికుడు లఘు చిత్రం షార్ట్ ఫిల్మ్ తీశాం. రాష్ట్రస్థాయిలో మేము గెలవడం ఎంతో ఆనందంగా ఉంది. – డోల వరప్రసాదరావు, 10వ తరగతి విద్యార్థి మోడల్ పాఠశాల, జి.సిగడాం
క్రమశిక్షణతో కూడిన విద్య
విద్యాలయంలో చదువుతున్న ప్రతి విద్యార్థికి క్రమశిక్షణతో కూడిన విద్య అందిస్తున్నాం. తల్లిదండ్రులు కూడా పిల్లల చదువుపై బాధ్యత తీసుకోవాలి. రాష్ట్రస్థాయిలో విద్యుత్ పొదుపుపై తీసిన చిత్రం నంబర్‌వన్ స్థానం కై వసం చేసుకోవడంతో ఎంతో ఆనందంగా ఉంది.
– కోట తిరుపతిరావు, తెలుగు అధ్యాపకుడు, మోడల్ పాఠశాల, జి.సిగడాం
అందరి సహకారంతోనే
విద్యాలయంలో పాఠాలు బోధిస్తున్న ఉపాధ్యాయులు, సిబ్బంది, సహకారంతోనే పవర్ ప్రేమికుడు లఘు చిత్రం తీశాం. విద్యుత్ వినియోగం ఎలా ఉండాలో వివరించాం. దానికి స్టేట్ ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. పోటీ పరీక్షల్లో కూడా విద్యార్థులు మంచి ప్రతిభ కనబరుస్తున్నారు. ఏటా ఎన్‌ఎంఎంఎస్‌లో మంచి ఫలితాలు సాధిస్తున్నాం.
– డాక్టర్ అన్నా శామ్యూల్ లంక, ప్రిన్సిపాల్,
ఏపీ మోడల్ పాఠశాల జి.సిగడాం
జి.సిగడాం:
అందుబాటులో మౌలిక సదుపాయాలు, ఆహ్లాదకరమైన వాతావరణం, అద్భుతమైన బోధన కలగలిపి జి.సిగడాం మోడల్ పాఠశాల. వరుసగా చక్కటి విజయాలు సాధిస్తూ రాష్ట్రంలోనే నంబర్‌వన్ పాఠశాలగా కీర్తినందుకుంటోంది. ఇక్కడ 6వ తరగతి నుంచి ఇంటర్ వరకు 700 మంది చదువుతున్నారు. ఇక్కడ ఉపాధ్యాయులు విద్యార్థులకు ఆటపాటలతో మెరుగైన విద్యను బోధిస్తున్నారు. దీంతో చక్కటి ఫలితాలు సాధ్యమవుతున్నాయి. ఇంటర్ విద్యార్థులకు ఆధునిక ల్యాబ్‌లు ఉన్నాయి. పదో తరగతి ఫలితాల్లో రాష్ట్రవ్యాప్తంగా 75–99 శాతం ఉత్తీర్ణత సాధించిన ఐదు పాఠశాలల్లో ఇది కూడా ఒకటి. ఇటీవల రాష్ట్రస్థాయిలో 200 విద్యాలయాలు, కార్పొరేట్ విద్యాలయాలు కలిసి విద్యుత్ వినియోగంపై లఘు చిత్రాల పోటీ నిర్వహించాయి. ఈ పోటీలో మోడల్ స్కూల్ విద్యార్థులు తీసిన పవర్ ప్రేమికుడు మొదటి బహు మతి కై వసం చేసుకుంది. ఇటీవల విజయవాడలో ఎనర్జీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కె.విజయానంద్, ఎండీ ఏపీ జెన్‌కో కేవీఎన్ చక్రధర్‌బాబు చేతుల మీదుగా తెలుగు అధ్యాపకులు కోట తిరుపతిరావు, విద్యార్థులు వి.వైకుంఠరావు, డోల వరప్రసాదరావు, ఎ.ఈశ్వర్, ఆర్.తేజ నగదు, ప్రశంసా పత్రాలు అందుకున్నారు. రాష్ట్ర ఎనర్జీ కన్జర్వేషన్ మిషన్ (ఏపీఎస్‌ఈసీఎం) నిర్వహించిన ఈ పోటీల్లో పవర్ ప్రేమికుడు అందరినీ ఆకట్టుకుంది.
రాష్ట్రస్థాయిలో నంబర్ వన్‌గా జి.సిగడాం మోడల్ స్కూల్
పది, ఇంటర్ ఫలితాల్లో చక్కటి ప్రతిభ
క్రమశిక్షణకు మారుపేరుగా ఖ్యాతి
బాలికలకు వృత్తి విద్యాకోర్సు
వృత్తి విద్యా కోర్సులో బాలికలు రాణించాలనే ఉద్దేశంతో మోడల్ స్కూళ్లలో వృత్తి విద్యా కోర్సులు ప్రవేశపెట్టారు. ఈ కోర్సులను జి.సిగడాం మోడల్ స్కూల్ విద్యార్థులు చక్కగా ఉపయోగించుకుంటున్నారు. ఈ ఏడాది 80 మంది విద్యార్థులకు వివిధ రకాల కోర్సులపై ప్రయోగాలు నిర్వహించారు. ఢిల్లీ యూని వర్సిటీ ప్రతినిధులు మంజు శర్మ, అనిత సింగ్ వచ్చి పరిశీలిచారు.
Comments
Please login to add a commentAdd a comment