టెక్కలిలో మినీ జాబ్‌మేళా రేపు
టెక్కలి: ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం టెక్కలి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మినీ జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ టి.గోవిందమ్మ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. 10వ తరగతి నుంచి డిగ్రీ వరకు ఉత్తీర్ణత సాధించి 18 నుంచి 45 ఏళ్ల వయసు కలిగిన నిరుద్యోగ యువత కోసం ఈ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఆమె వెల్లడించారు. ఉదయం 9.30 గంటల నుంచి నిర్వహిస్తున్న ఈ జాబ్‌మేళాకు హాజరయ్యే అభ్యర్థుల విద్యార్హత పత్రాలు, ఆధార్ కార్డు, బయోడేటా పత్రాలు, ఫొటోలతో హాజరు కావాలన్నారు. మరిన్ని వివరాలకు 9493290012 ఫోన్ నంబర్‌ను సంప్రదించాలని కోరారు.
కామ్రేడ్ చిలకమ్మకు ఘన నివాళి
కాశీబుగ్గ: భారతదేశంలో సమరశీల ప్రతిఘటన పోరాటాలను నిర్మించడమే శ్రీకాకుళం గిరిజన రైతుల సాయుధ పోరాటమని అలాంటి పోరాట యోధురాలు, ఆదివాసీ వీర వనిత సవర చిలకమ్మ అని సీపీఐ న్యూడెమొక్రసీ జిల్లా కమిటీ కార్యదర్శి తాండ్ర ప్రకాష్ అన్నారు. చిలకమ్మ 29వ వర్ధంతి సందర్భంగా శ్రీకాకుళం జిల్లా మందస మండలం కొండలోగాం ఆదివాసీ గ్రామంలో ఆదివారం ఉద యం 10గంటలకు చిలకమ్మ స్మారక స్థూపం వద్ద కార్యక్రమం నిర్వహించారు. సీపీఐ న్యూడెమోక్రసీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జరిగిన స్మారక సభకు ప్రకాష్ అధ్యక్షత వహిస్తూ మాట్లాడారు. కామ్రేడ్ చిలకమ్మ కనబరిచిన పోరాట స్ఫూర్తిని వివరించారు. అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సన్నశెట్టి రాజశేఖర్ ప్రధాన వక్తగా పాల్గొని మాట్లాడారు. సీపీఐ న్యూమొక్రసీ జిల్లా నా యకులు గొరకల బాలకృష్ణ, ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పోతనపల్లి కుసుమ, వంకల మాధవరావు, పీడీఎస్‌యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.వినోద్, ఐఎఫ్‌టీయూ జిల్లా నాయకులు జుత్తు వీరాస్వామి, బర్ల గోపి, పోతనపల్లి మల్లేశ్వరరావు, పీవైఎల్ జిల్లా కన్వీనర్ సార జగన్, ఏఐకెఎంఎస్ జిల్లా నాయకులు రాపాక మాధవరావు, అరుణోదయ నాయకుడు సొర్ర రామారావు, ప్రజా కళాకారుడు కుత్తుం వినోద్, వంకల పాపయ్య, ఆదివాసి నాయకుడు బంగ్లా కుమార్ తదితరులు మాట్లాడారు.
బీసీలు ఏకమవ్వాలి
శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): రాజకీయ ఉనికి కాపాడుకోవటానికి బీసీలు ఏకమవ్వాల్సిన సమయం ఆసన్నమైందని బహుజన్ సమాజ్ పార్టీ ఉత్తరాంధ్ర నేతలు అన్నారు. శ్రీకాకుళం నగరంలో అంబేడ్కర్ విజ్ఞాన మందిర్‌లో బీసీ సమన్వయ కమిటీ సమావేశం ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో అనాదిగా స్థానికేతరులు ఉత్తరాంధ్ర రాజకీయ స్థలాన్ని ఆక్రమించి ఇక్కడి ప్రజల కష్టాలను, ఆకాంక్షలను, అవసరాలను పట్టించుకోకుండా రాజకీయం చేస్తున్నారని ఉ త్తరాంధ్ర బీసీ సంఘాల నాయకులు అన్నారు. స్థానికేతరులను తీసుకొచ్చి గెలిపించుకుంటే ఉత్తరాంధ్రకు ఒరిగేదేమీలేదన్నారు. సమావేశంలో బీసీ సంఘాల సమన్వయకమిటీ రాష్ట్ర చైర్మన్ ఎ.పూర్ణచంద్రరావు, కన్వీనర్ బి.సి రమణ, కో కన్వినర్ కె.శ్రీనివాసయాదవ్, బహుజన సమాజ్‌పార్టీ రాష్ట్ర కో–ఆర్డినేటర్ రాజారావు, బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు ఎల్.గరికివాడు తదితరులు పాల్గొన్నారు.
11.43 కిలోల గంజాయితో ఇద్దరు అరెస్టు
ఇచ్ఛాపురం: ఒడిశా నుంచి బెంగళూరుకు అక్రమంగా 11.43 కిలోల గంజాయిని రవాణా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు ప్రొహిబిషన్ ఎకై ్సజ్ ఇన్‌స్పెక్టర్ పి.దుర్గాప్రసాద్ తెలిపారు. శనివారం ప్రొహిబిషన్ ఎక్సైజ్ సిబ్బంది స్థానిక రైల్వేస్టేషన్ పరిధిలో తనిఖీలు నిర్వహిస్తుండగా ఒడిశా దిగపొండి బ్లాక్‌కి చెందిన లాలుప్రసాద్‌శెట్టి, అదే రాష్ట్రం గంజాం జిల్లా చీకటి బ్లాక్‌కి చెందిన సోనూగౌడ అనే ఇద్దరు వ్యక్తులు పట్టుబడినట్లు ప్రొహిబిషన్ సిబ్బంది తెలిపారు. నిందితుల వద్ద నుంచి గంజాయి, ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకొని అరెస్టు చేసినట్లు తెలియజేశారు. వీరికి గంజాయి సరఫరా చేస్తున్న చీకటి బ్లాక్‌కి చెందిన కన్నమహరాణని త్వరలో పట్టుకుంటామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment