ఐకమత్యంగా హక్కులు సాధించుకోవాలి
టెక్కలి: తూర్పు కాపులు సామాజికంగా, రాజకీయంగా మరింత అభివృద్ధి చెందాలని, హక్కులు సాధించుకోవడానికి ఐకమత్యంగా ముందుకు సాగాలని శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ఆకాంక్షించారు. ఆదివారం టెక్కలి సమీపంలో నిర్వహించిన తూర్పు కాపుల ఆత్మీయ సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మారుమూల ప్రాంతంలో తూర్పుకాపుల ఆత్మీయ సమావేశం నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. తూర్పు కాపుల సంక్షేమానికి నిరంతరం తోడుగా ఉంటానని బొత్స హామీ ఇచ్చారు. అనంతరం తూర్పు కాపు కార్పొరేషన్ చైర్ పర్సన్ పాలవలస యశస్విని మాట్లాడుతూ తూర్పు కాపుల అభ్యు న్నతి కోసం నిరంతరం కృషి చేస్తానని పేర్కొన్నారు. అనంతరం సమావేశంలో పలు తీర్మానాలు చేశారు. అనంతరం చిన్నారులు వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. అలాగే సామాజిక వర్గం వివాహ పరిచయ కార్యక్రమాలను నిర్వహించారు. కార్యక్రమంలో అతిథులు కిమిడి రామ్‌మల్లిక్ నాయుడు సంఘం జిల్లా అధ్యక్షుడు ఎస్.మోహన్‌రావు, సభ్యులు డోల జగన్, మామిడి శ్రీకాంత్, పి.చంద్రమోహన్, ఎం.స్వరూప్, ఎం.రామజోగినాయుడు, కె.నారాయణరావు, సుడా చైర్మ న్ కొరికాన రవి, కె.రాజేశ్వర్రావు, ఎ.రామకృష్ణంనాయుడు, పి.వసంతరావు, వి.సత్యన్నారాయణ, వి.కృష్ణచంద్, కె.రమణమూర్తి, శాంతారావు, బి.రాజశేఖర్, టి.బలరాం, పి.చంద్రశేఖర్(కింగ్), పి.డిల్లేశ్వరావ్రు, పి.మోహన్‌రావు, ఎస్.రాజు, ఆర్.జయమోహన్ తో పాటు తూర్పు కాపు సంక్షేమ సంఘం సభ్యులు పాల్గొన్నారు.
తూర్పు కాపుల
ఆత్మీయ సమావేశంలో ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ
Comments
Please login to add a commentAdd a comment