శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లాలో సిక్కోలు డ్వాక్రా బజార్ సోమవారం నుంచి ప్రారంభం కానుంది. ఏడు రోడ్ల కూడలిలోని మున్సిపల్ మైదానంలో స్వయం సహాయక సంఘాల మహిళలు తయారు చేసిన ఉత్పత్తులను ప్రద ర్శించి, అమ్మకానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ బజార్‌లో చేనేత వస్త్రాలు, హస్తకళలు, చేతి వంటల ఆహార పదార్థాలు తదితర ఉత్పత్తుల ప్రదర్శన అమ్మకాలు ఉంటాయి. స్వయం సహాయక సంఘాల మహిళల కృషిని ప్రోత్సహించడానికి ఇది మంచి అవకాశమని, ఉత్పత్తుల ప్రదర్శనను తిలకించి వాటిని కొనుగోలు చేయడం ద్వారా జిల్లా ప్రజలు వారిని ఆర్థికంగా కూడా ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు.
జాతీయ కబడ్డీ పోటీలకు ఐదుగురు ఎంపిక
శ్రీకాకుళం న్యూకాలనీ: జాతీయస్థాయి జూనియర్స్ కబడ్డీ చాంపియన్‌షిప్ పోటీలకు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా నుంచి రికార్డుస్థాయిలో ఐదుగురు క్రీడాకారులు ఎంపికయ్యారు. ఎంపికై నవారిలో పాలక మణికంఠ (జిల్లేడుపాడు, సీతంపేట మండలం), ముద్దాడ నరేష్ (ముట్టవానిపేట, జలుమూరు మండలం), లామాడి లీసా (పల్లిసారధి, వజ్రపుకొత్తూరు మండలం), సంగారి హర్షిత (పల్లిసారధి, వజ్రపుకొత్తురు మండలం), కందివలస శ్రావణి (నాగంపాలెం, లావేరు మండలం) ఉన్నారు. వీరంతా ఈనెల 8 నుంచి 12వ తేదీవరకు ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హరిద్వార్ వేదికగా జరిగే జాతీయ పో టీల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలబాలికల జట్లకు ప్రాతినిధ్యం వహించనున్నారు. ఇటీవలి రావులపాలెంలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో జిల్లా బాలబాలికల రెండు జట్లు చాంపియన్లుగా నిలిచిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment