నాణ్యత లేని డీజిల్ విక్రయం
నరసన్నపేట: మండలంలోని గుండవల్లిపేట వద్ద భారత్ పెట్రోలియం బంకులో డీజిల్ నాణ్యతగా లేదని జలుమూరు మండలం గుండువలసకు చెందిన ట్రాక్టర్ యజమాని కూర్మారావు ఆరోపించారు. శనివారం తన డ్రైవర్ మూడు వేల రూపాయల డీజిల్‌ను ట్రాక్టర్‌లో వేసి పొలానికి వెళ్లగా మొరాయించిందని, మెకానిక్‌కు చూపిస్తే డీజిల్‌లో నీరు కలవడం వల్ల ఇంజిన్ సీజ్ అయిందని చెప్పాడని పేర్కొన్నారు. ఈ విషయమై బంకు సిబ్బందిని ప్రశ్నించగా ఎదురుదాడికి దిగారని ఆవేదన వ్యక్తం చేశారు. తాము డీజిల్ కొన్నట్లు బంకులో సీసీ కెమెరాల్లో కూడా రికార్డ్ అయ్యిందని, నాణ్యత లేని డీజిల్ విక్రయాలు చేస్తే ఎలా అని ప్రశ్నించారు. విషయాన్ని నరసన్నపేటలో రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోలేదని, న్యాయం కోసం సోమవారం కలెక్టర్ గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేస్తామని కూర్మారావు తెలిపారు. ఈ విషయమై బంకు సిబ్బంది వద్ద ‘సాక్షి’ ప్రస్తావించగా పొంతన లేని సమాధానాలు చెప్పి తప్పించుకోవడానికి ప్రయత్నించారు.
● ట్రాక్టర్ పాడైందని యజమాని ఆందోళన
Comments
Please login to add a commentAdd a comment