● అదను చూసి దెబ్బకొట్టిన చంద్రబాబు ● తక్కువ వినియోగం జర
● వినియోగం తగ్గడం వల్ల బిల్లు పెద్దగా రాదని వ్యూహత్మకంగా వ్యవహరించిన కూటమి సర్కారు ● జనవరి నెలలోనే కనిపించిన బాదుడు ప్రభావం ● వేసవి వస్తే భారీ మోత తప్పదు
ఇదే వినియోగదారుడికి 2024 డిసెంబర్ 6 నుంచి 2025 జనవరి 3వ తేదీవరకు వచ్చిన విద్యుత్ బిల్లు ఇది. ఈ నెలలో కేవలం 55యూనిట్లు వినియోగిస్తే బిల్లు రూ. 340.93వచ్చింది.
సారవకోటకు చెంది న వినియోగదారుడి కి 2024 సెప్టెంబర్ 5 నుంచి అక్టోబర్ 3వ తేదీవరకు వర కు వచ్చిన విద్యుత్ బిల్లు ఇది. ఈ నెల లో 113 యూనిట్లు వినియోగిస్తే రూ. 473.37వచ్చింది.
వాస్తవంగా గత బిల్లు కంటే ఈ బిల్లులో దాదాపు 58 యూనిట్ల తక్కువ వినియోగం జరిగింది. ఈ లెక్కన బిల్లు సగానికి పైగా తగ్గాలి. కానీ అంత తగ్గలేదు.
టెక్కలిలోని ఎన్టీఆర్ కాలనీలో నివసిస్తున్న ఓ వినియోగదారుడి బిల్లు ఇది. 2024 అక్టోబర్ 6వ తేదీ నుంచి నవంబర్ 3వ వరకు వచ్చిన విద్యుత్ బిల్లులో ట్రూ అప్ చార్జీల కింద ఎఫ్‌పీపీసీఏ చార్జీ–2 కింద రూ. 82 ఉంది.
శ్రీకాకుళం నగరంలోని ఓ వినియోగదారుడికి 2024 అక్టోబర్ 2 నుంచి 2024 నవంబర్ 2వ తేదీ వరకు వచ్చిన విద్యుత్ బిల్లు ఇది. ఈ నెలలో 145 యూనిట్లు వినియోగిస్తే రూ.675.42 వచ్చింది.
ఇదే వినియోగదారుడికి 2024 డిసెంబర్ 2 నుంచి 2025 జనవరి 3వ తేదీవరకు వచ్చిన విద్యుత్ బిల్లు ఇది. ఈ నెలలో 123 యూనిట్లు వినియోగిస్తే రూ. 686.80 వచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment