లైఫ్ సర్టిఫికెట్ల అప్‌లోడ్‌కు సాయం
శ్రీకాకుళం పాతబస్టాండ్: రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డు ఉద్యోగులు పింఛన్ కోసం ఏటా అందజేయాల్సిన లైఫ్ సర్టిఫికెట్ అప్‌లోడ్ చేసేందుకు ఏపీ రాష్ట్ర ప్రభు త్వ పింఛనుదారుల సంఘం ప్రతినిధులు స్వచ్ఛందంగా ముందుకొస్తున్నారు. పెన్షన్‌దారుల ఇళ్లకు వెళ్లి ఆన్‌లైన్‌లో సర్టిఫికెట్లు అప్‌లోడ్ చేస్తున్నట్లు సంఘం అధ్యక్ష కార్యదర్శులు రోణంకి రామచంద్రరా వు, అంకం ధర్మారావు, ఎన్.వి.రమణ, పి.శాంతారాం, దొంతం పార్వతీశం తెలిపారు. ఫిబ్రవరి 28 వరకు కార్యక్రమం కొనసాగిస్తామని చెప్పారు. ఈ నెల 21 నుంచి 28 వరకు శ్రీకాకుళం ఎన్జీవో హోమ్‌లో ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేసే కార్యక్రమం జరుగుతుందని, ఈ అవకాశాన్ని వినియోగించుకో వాలని కోరారు. ఆధార్, పీపీవో, బ్యాంకు ఖాతా, బ్రాంచి, ఫోన్ నంబర్లను తీసుకురావాలని, పూర్తి వివరాలకు 8341275557, 8555919837 నంబర్లను సంప్రదించవచ్చని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment