రసాయనాల లీకేజీపై మాక్‌డ్రీల్
రణస్థలం: రసాయనిక పరిశ్రమల్లో మిథనాల్ సాల్వెంట్ వంటి రసాయనాలు లీకై నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేస్తూ శుక్రవారం పైడిభీమవరం పారిశ్రామికవాడలోని ఏపీటోరియా ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్ యూనిట్–4లో మాక్‌డ్రిల్ నిర్వహించారు. జిల్లా డిప్యూటీ చీఫ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ రాంబాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పైపులైన్ నుంచి మిథనాల్ సాల్వెంట్ లీకవ్వడం, వెంటనే అరికట్టడం వంటి చర్యలను సిబ్బంది కళ్లకు కట్టినట్లు చూపించారు. కార్యక్రమంలో జిల్లా అగ్నిమాపక అధికారి జె.మోహన్‌రావు, ఫ్యాక్టరీస్ మేనేజర్ మదన్‌కుమార్, రణస్థలం అగ్నిమాపక అధికారి పైల ఆశోక్, ఎన్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది, భద్రత అధికారి సంపత్ రెడ్డి, హెచ్‌ఆర్ అడ్మిన్ అధికారి కమలాకర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment