రాష్ట్ర స్థాయి ఫెన్సింగ్ పోటీల్లో సిక్కోలు జోరు
శ్రీకాకుళం న్యూకాలనీ: రాష్ట్ర స్థాయి క్యాడెట్ ఫెన్సింగ్ పోటీల్లో జిల్లా క్రీడాకారులు సత్తాచాటారు. కాకినాడ వేదికగా జరిగిన ఈ పోటీల్లో అండర్–17 విభాగం బాలురు కేటగిరీలో ఫాయిల్ టీం విభాగంలో పిల్ల సునీల్, కె.దుర్గాప్రసాద్, సిమ్మ యశ్వంత్, బొక్కెల హర్షలు కాంస్య పతకాలు సాధించారు. సాబర్ టీం విభాగంలో పీస హర్షిత్ రామ్‌చరణ్, కొండ్రు హేమసుందర్, వజ్రపతి రాజేష్ కాంస్య పతకాలు సాధించారు. ఇప్పి టీం బాలికల విభాగంలో ధనాల జోష్ని, రోషిత, దుర్గ భవాని, రాజేశ్వరిలు రజత పతకాలు సాధించి శభాష్ అనిపించారు. క్రీడాకారులను శుక్రవారం టౌన్‌హాల్‌లో జిల్లా ఫెన్సింగ్ అసోసియేషన్ అధ్యక్షులు బలభద్రుని రాజా అభినందించారు. ఎన్‌ఐఎస్ కోచ్ జోగిపాటి వంశీ సేవలను మెచ్చుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment