రైతుల సమస్యలు పరిష్కరించాలి
శ్రీకాకుళం పాతబస్టాండ్ : జిల్లాలో ధాన్యం అమ్మేందుకు వెళ్తున్న రైతులు మిల్లర్ల నుంచి వేధింపులకు గురవుతున్నారని, వారి సమస్యలు పరిష్కరించాలని బీసీ సంక్షేమ సంఘ నాయకులు బీన ఢిల్లీరావు కోరారు. ఈ మేరకు మంగళవారం జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్‌ఖాన్‌కు వినతిపత్రం అందజేశారు. పలాస డివిజన్ పరిధిలో 10 కిలోల ధాన్యం ఎక్కువగా తూకం వేస్తున్నారని, ఇదేంటని రైతులు ప్రశ్నిస్తే ధాన్యం పట్టుకెళ్లిపోండని మిల్లర్లు బెదిరిస్తున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో చౌదరి లక్ష్మణరావు, అమిరుల్లా బేగ్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment