‘గత కేసులనూ పరిశీలిస్తాం..’
శ్రీకాకుళం క్రైమ్ : జిల్లా కేంద్రంలోని బలగ మెట్టు డీసీసీబీ బ్యాంకు సమీపంలో నివసిస్తున్న దంపతులను కొంతమంది పత్రికా విలేకరులు బెదిరించిన ఘటన తన దృష్టికి వచ్చిందని ఎస్పీ మహేశ్వరరెడ్డి అన్నారు. మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో పత్రికా విలేకరుల సమావేశంలో ఎస్పీ మాట్లాడారు. ఇప్పటికే పోలీసులు కేసును నమోదు చేశారన్నారు. వారిపై ఇదివరకే కేసులున్నాయన్న విషయం తెలిసిందని, ఈ కేసుకు సంబంధించి సమగ్ర విచారణ తమ పోలీసు లు జరుపుతున్నారన్నారు. కొద్దిరోజుల క్రితం బయటపడిన ఆర్మీకాలింగ్ రమణ అకృత్యాలకు సంబంధించి బాధితుల నుంచి కొత్త ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. విచారణ చేస్తున్నామని, టెక్నికల్ ఎవిడెన్సులైన పెన్‌డ్రైవ్‌లు, ఇతరత్రా అన్ని ఆధారాలను పరిశీలిస్తున్నామన్నారు. నకిలీ నోట్ల కేసుకు సంబంధించి ఓ కేసులో రాజమండ్రికి చెందిన ప్రధాన నిందితుడిని ఇప్పటికే అక్కడి పోలీసులు అరెస్టు చేశారని అతని ద్వారా జిల్లాలో ఇంకెవరెవరున్నారన్న దానిపై ఆరా తీస్తామన్నారు.
నేరాలు తగ్గాయి: ఎస్పీ
శ్రీకాకుళం క్రైమ్ : జిల్లాలో రాత్రి పూట దొంగతనాలు పెరిగాయని, గంజాయి, ఎన్‌డీపీఎ ల్, సైబర్ నేరాలకు సంబంధించిన కేసులు పెరిగాయని, మహిళలపై మానభంగ కేసులు పెరిగాయని, నేరాలు మొత్తంగా చూసుకుంటే 2023 ఏడాదితో పోల్చితే 2024లో అన్ని రకాల నేరాలు గణనీయంగా (17 శాతానికి) తగ్గా య ని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి అన్నారు. మంగళవారం సాయంత్రం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ విలేకరుల సమావేశం నిర్వహించి వార్షిక గణాంకాలు వెల్లడించారు. 2023లో 11,017 కేసులు నమోదు కాగా 2024లో 9434 కేసులు నమోదయ్యాయన్నారు. మహిళలపై నేరాలు తగ్గాయని 462 కేసులు నమోద య్యా యని తెలిపారు. 2023లో 282 రోడ్డు ప్రమాదాలు జరగ్గా 2024లో 272 నమోదయ్యాయని 282 మంది మరణించారన్నారు. 2023లో 410 మిస్సింగ్ కేసులు నమోదు కాగా 2024లో 408 కేసులు నమోదయ్యాయన్నారు. నూతన సంవత్సరంలో అడుగిడుతున్న సందర్భంగా ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. 2025లో ప్రజలు నిర్దేశించుకున్న లక్ష్యాలు నెరవేరాలని ఆకాంక్షించారు.
Comments
Please login to add a commentAdd a comment