జాతీయ స్కూల్‌గేమ్స్ క్రికెట్ పోటీలకు జ్యోస్మిత్
శ్రీకాకుళం న్యూకాలనీ: జాతీయస్థాయి స్కూల్‌గేమ్స్ క్రికెట్ పోటీలకు శ్రీకాకుళం జిల్లా నుంచి తుంగాన జ్యోస్మిత్ ఎంపికయ్యాడు. ఢిల్లీలో వేదికగా జరగనున్న ఆలిండియా స్కూల్‌గ్స్ అండర్–14 బాలుర క్రికెట్ చాంపియన్‌షిప్–2024–25 పోటీల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరఫున జ్యోస్మిత్ ప్రాతినిధ్యం వహించనున్నాడు. ఇటీవల డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురం వేదికగా గత నెల డిసెంబర్ 28 నుంచి 30వరకు జరిగిన 68వ ఏపీ రాష్ట్రస్థాయి స్కూల్‌గేమ్స్ క్రికెట్ పోటీల్లో ఈ సిక్కో లు ఆశాకిరణం మెరుగ్గా రాణించడంతో జాతీయ పోటీల్లో పాల్గొనే అవకాశాన్ని అందిపుచ్చుకున్నాడు. శ్రీకాకుళం నగరంలోని ఆర్‌సీఎం సెయింట్ జాన్స్ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న జ్యోస్మిత్ జాతీయ పోటీల్లో రాణించేందుకు కఠోర సాధన చేస్తున్నాడు. తండ్రి తుంగాన ఆనంద్ సత్యవరం(నరసన్నపేట మండలం) జెడ్పీహెచ్‌స్కూల్‌లో ఫిజికల్ డైరెక్టర్‌గా పనిచేస్తుండగా, తల్లి సునీత గృహిణి.
Comments
Please login to add a commentAdd a comment