ఆపరేషన్‌ ప్రసవాలతో ఇబ్బందులు.. | - | Sakshi
Sakshi News home page

ఆపరేషన్‌ ప్రసవాలతో ఇబ్బందులు..

Published Fri, Jan 3 2025 1:02 AM | Last Updated on Fri, Jan 3 2025 1:02 AM

ఆపరేషన్‌ ప్రసవాలతో ఇబ్బందులు..

ఆపరేషన్‌ ప్రసవాలతో ఇబ్బందులు..

● సహజ ప్రసవ సమయంలో హార్మోన్లు విడుదల కావడం వల్ల బాలింతలో సహజంగానే చనుబాలు ఉత్పత్తి అవుతాయి. అదే ఆపరేషన్‌ అయితే పిల్లల పుట్టిన వెంటనే పాలు ఇవ్వడం కష్టమవుతుంది.

● ముర్రుపాటు ఇవ్వక పోతే అది బిడ్డ ఎదుగుదలపై ప్రభావం చూపుతుంది.

● సిజేరియన్‌ సమయంలో గర్భిణి మూత్రనాళానికి, పేగులకు గాయాలయ్యే అవకాశం ఉంటుంది.

● శస్త్ర చికిత్స జరిగితే నొప్పితో బాలింత వారాల తర బడి మంచానికి పరిమితం కావాల్సి వస్తుంది.

● కదలికలు తక్కువ కావడం వల్ల హెర్నియో వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

● పీరియడ్స్‌ సమయంలో అధిక రక్త స్రావం వంటివి చోటు చేసుకొనే ప్రమాదం ఉంటుంది.

కారణాలు అనేకం..

● ఆహారపు అలవాట్లలో మార్పు రావడం, వ్యాయామ లేమి, బయట తిళ్లు ఎక్కువగా తీసుకోవడం వంటివి గర్భిణుల ఆరోగ్యంపై ప్రభావం చూపుతున్నాయి.

● రక్తపోటు, చక్కెర శాతం పెరగడం, థైరాయిడ్‌ వంటి అనారోగ్య ఇబ్బందులు వస్తున్నాయి. ఇలాంటి లక్షణాలు ఉండే మహిళలకు సిజేరియన్‌ చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement