డీఎంహెచ్‌ఓ బాధ్యతల స్వీకరణ
అరసవల్లి: జిల్లా వైద్యారోగ్య శాఖాధికారిగా డాక్టర్ టీవీ బాలమురళీ కృష్ణ గురువారం కొత్తగా బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు ఆయన అరసవల్లి సూర్యనారాయణ స్వామిని దర్శించుకుని అనంతరం డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో అధికార సిబ్బంది నడుమ బాధ్యతలు స్వీకరించారు. ఇంతవరకు డీఎంహెచ్‌ఓగా బాధ్యతలు నిర్వర్తించిన బి.మీనాక్షికి విశాఖపట్నం బదిలీ చేసిన సంగతి విదితమే. దీంతో కొత్తగా బాలమురళీకృష్ణ బాధ్యతలు స్వీకరించడంతో స్థానిక వైద్యాధికారులు అభినందనలు తెలియజేశారు. డిప్యూటీ డీఎంహెచ్‌ఓ మేరి, ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ డాక్టర్ ప్రకాశరావు, కార్యాలయ ఏఓ బాబూరావు, సూపరింటెండెంట్ భాస్కరకుమార్ తదితరులు ఆయన్ను కలిసి పూలమాలలతో సత్కరించి ఆహ్వానించారు.
Comments
Please login to add a commentAdd a comment