రాజ్యాంగాన్ని కాపాడుకుందాం
మతోన్మాదుల నుంచి
శ్రీకాకుళం(పీఎన్‌కాలనీ): దేశంలోని మతోన్మాదుల నుంచి రాజ్యాంగాన్ని కాపాడుకుందామని వివిధ దళిత, ఆదివాసీ, ప్రజా సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. నగరంలోని అంబేడ్కర్ కూడలి వద్ద దళిత, ఆదివాసీ ప్రజా సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో మనుస్మృతి దహనం కార్యక్రమం బుధవారం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పార్లమెంట్ వేదికగా అంబేడ్కర్‌పై తీవ్రమైన వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోం మంత్రి అమిత్ షాను తక్షణమే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. అయితే మనుస్మృతి తగలబెడుతుంటే పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం అంబేద్కర్ విజ్ఞాన మందిరంలో సనాతన ధర్మం – భారత రాజ్యాంగం అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వచించారు. ఈ సందర్భంగా సామాజిక న్యాయ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు కళ్లేపల్లి రాంగోపాల్, కుల నిర్మూలన పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు మిస్క కృష్ణయ్య, పౌర హక్కుల వేదిక నాయకుడు దానేశ్, మానవ హక్కుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు కేవీ జగన్నాథం, జన విజ్ఞాన వేదిక నాయకుడు గొంటి గిరిధర్, మాల కార్పొరేషన్ డైరెక్టర్ బోనెల అప్పారావు, సామాజిక న్యాయ పోరాట సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి డి.గణేష్, డీటీఎఫ్ కోత ధర్మారావు, కవి, సంపాదకుడు కృష్ణారావు, కుల నిర్మూలన పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు బెలమర ప్రభాకర్, అంబేడ్కర్ విజ్ఞాన మందిరం కమిటీ ప్రధాన కార్యదర్శి బడే కామరాజు, సమతా సైనిక్ దళ్ జిల్లా ప్రధాన కార్యదర్శి సల్ల రామారావు తదితరులు మాట్లాడారు. భారత రాజ్యాంగాన్ని మార్చాలనే కుట్రతో బీజేపీ ప్రభుత్వం ముందుకు వెళ్తోందన్నారు. ప్రజలంతా ఈ విషయాన్ని గమనించి పాలకుల పోకడలు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎడ్ల జానకిరావు, బొడ్డేపల్లి భుపతిరావు, వీజీకే మూర్తి, తంగి యరమ్మ, లింగాల అప్పన్న, కంఠ వేణు, కృష్ణవేణి బాలు, గన్నెప్పడు, బీవీ రమణ, చిన్నికృష్ణ, హరిప్రసాద్, రామప్పడు, శ్రీనివాసరావు, బీటీఏ నాయకులు చీర రమేష్, జగన్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు
Comments
Please login to add a commentAdd a comment