బొడ్డపాడు అల్లుడు చలపతి
● మావో అగ్రనేత చలపతి మృతితో ఉద్దానంలో విషాదం
పలాస: మావోయిస్టు ముఖ్యనేత చలపతి మృతి చెందడంతో ఉద్దానం ఉలిక్కిపడింది. ఆయనతో ఉ ద్దానానికి అవినాభావ సంబంధం ఉంది. అంతేకాదు ఆయన ఉద్యమాల పురిటి గెడ్డ బొడ్డపాడు గ్రామానికి అల్లుడు కూడా. ఆ గ్రామానికి చెందిన రుక్మిణి అనే అమ్మాయిని పెళ్లి చేసుకొని ఆమెను కూ డా ఆనాటి పీపుల్స్‌వార్ పార్టీలోకి తీసుకొని అజ్ఞాత జీవితాన్ని గడిపారు. ఉద్దానం ప్రాంతంలో ఎన్నో ప్రజా పోరాటాలను చేపట్టారు. పార్టీపై ప్రభుత్వం నిషేధం విధించడంతో రహస్య జీవితంలోకి వెళ్లిపోయారు. ఆయనతో పాటు ఆమె కూడా పార్టీ రహస్య కార్యక్రమాల్లోకి వెళ్లిపోయారు. 1988లో చిత్తూరు జిల్లా నుంచి శ్రీకాకుళం వచ్చిన చలపతి సుధాకర్‌గా పేరు మార్చుకుని ఉద్దానం ప్రాంతంలో ఆర్గనైజర్‌గా పనిచేశారు. ఆయన పూర్తి పేరు ప్రతాప రెడ్డి. 1988 నుంచి 94 వరకు ఉద్దానం ప్రాంతంలో పనిచేసి ఆ పార్టీని నడిపించాడు. ఆ సమయంలోనే బొడ్డపాడు గ్రామానికి చెందిన రుక్మిణి అనే అమ్మా యిని పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత ఆమె కూడా పోలీసు ఎదురు కాల్పుల్లో మృతి చెందారు.
Comments
Please login to add a commentAdd a comment