దాతలంటే అంత అలుసా..?
అరసవల్లి: అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయానికి దాతలే అభివృద్ధి ప్రదాతలు. కానీ వారు ఇప్పుడు అధికారులకు అలుసైపోయారు. ఇంతవరకు రూ.లక్ష వరకు విరాళాలిచ్చిన దాతలకు రథ సప్తమి వేళల్లో ఒక్కో డోనర్ పాసును ఇచ్చేవారు. కానీ దాతల ప్రాధాన్యతను ఎలాగై నా తగ్గించేందుకు కుట్ర పన్నారో ఏమో గానీ ‘ఒక పేరుకు ఒకే పాసు’ విధానం అమలు చేశా రు. ముందస్తుగా ఎలాంటి సమాచారం లేకుండా ఈ విధానాన్ని అమలు చేయడంతో దాతలు తీవ్ర ఇబ్బందులు పడడంతో పాటు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. శనివారం సాయంత్రం నుంచి దాతల పాసుల పంపిణీని ప్రారంభించా రు. అయితే రూ.లక్ష ఇచ్చిన వారికి ఒక పాసు ఇస్తున్నారు. అదే రూ.4 లక్షలిస్తే రెండు పాసులిచ్చి పంపించేస్తున్నారు. అలాగే రూ.10 లక్షల వరకు విరాళాలిచ్చిన వారికి కేవలం ఐదు పాసులివ్వడాన్ని దాతలు జీర్ణించుకోలేకపోతున్నారు.
●పాసులు తగ్గించి ఇస్తే.. ఊరుకునేది లేదు
అరసవల్లి ఆలయానికి అవసరమైనప్పుడు సంప్రదించిన ప్రతిసారీ నాలుగు దఫాలుగా రూ.లక్ష చొప్పున నాలుగు లక్షలు ఇచ్చాను. గత ఏడాది నాలుగు పాసులు ఇచ్చారు. ఇప్పుడు కేవలం రెండు పాసులు ఇస్తున్నారు. నాకు వద్దు... నాలుగు పాసులు ఇవ్వాల్సిందే అని పట్టుబట్టాను. జిల్లా కలెక్టర్‌కు అడిగినా పెద్ద స్పందన లేకపోవడం దారుణం. – మెట్ట నాగరాజు, రూ.4 లక్షలిచ్చిన దాత
Comments
Please login to add a commentAdd a comment