ఆవరణమంతా.. మందు బాబుల సంత
● మహిళా కళాశాల ప్రాంగణంలో మద్యం బాటిళ్లు ● ఆందోళనకు గురి చేస్తున్న అక్కడి పరిస్థితులు ● అక్కడే ఆరు విద్యార్థినుల వసతి గృహాలు ● గురువారం రాత్రి విద్యార్థినిపై జరిగిన దాడి కూడా అక్కడే
●చర్యలు చేపడతాం..
డిగ్రీ కళాశాలతో పాటు జూనియర్ కళాశాల ఉన్న ఇదే ప్రాంగణంలో 6 వసతి గృహాలు ఉన్నాయి. ఇంటర్ నుంచి పీజీ వరకు చదువుతున్న విద్యార్థులు ఉంటున్నారు. ఇంతమందిని పర్యవేక్షించే పరిస్థితి లేదు. లోపల నిర్మాణ పనులు జరగడం.. విద్యార్థు ల సంబంధీకులు రాకపోకలు సాగించడంతో ఎవరీ మీద ప్రత్యేక దృష్టిసారించే అవకాశం లేదు. లైట్లు కొన్ని వెలగకుంటే కొన్నింటి మరమ్మతులు చేపట్టాం. మద్యం బాటిళ్ల సంగతి నా దృష్టికి రాలేదన్నా రు. పరిశీలించి చర్యలు చేపడతాం.
–డాక్టర్ కింతలి సూర్యచంద్రరావు,
మహిళా కళాశాల ప్రిన్సిపాల్
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం:
జిల్లా కేంద్రంలోని మహిళా కళాశాల పరిస్థితులు ఆందోళనకు గురి చేస్తున్నాయి. బయటకు వ్యక్తులు లోపలకు ప్రవేశించి మద్యపానం చేస్తున్న ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. ఇక్కడ జూనియర్, డిగ్రీ కళాశాలలు నడుస్తున్నాయి. అలాగే ఆరు విద్యార్థినుల హాస్టళ్లు ఉన్నాయి. దాదాపు 1248 మంది హాస్టల్ వి ద్యార్థులున్న చోట నిర్వాహకులు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. కానీ ఇక్కడి పరిస్థితులు చూస్తుంటే జాగ్రత్త అన్నదే కనిపించడం లేదు. సాధారణంగా క ళాశాలకు వాచ్‌మెన్‌లు ఉంటారు. హాస్టల్స్‌కు కూడా రొటేషన్ పద్ధతిలో ఉన్న సిబ్బందిలో ఒకరు వాచ్‌మెన్‌గా రాత్రిపూట విధులు నిర్వర్తిస్తుంటారు. వీరంతా మద్యం బాటిళ్లతో వచ్చే వారిని కట్టడి చేయలేకపోతున్నారా? లేదంటే భయపడి చూసీచూడనట్టు వదిలేస్తున్నారా? అన్నది అంతు చిక్కడం లేదు. కాలేజీ ప్రాంగణంలోకి ఎవరు మద్యం బాటిళ్లతో వె ళ్తున్నారో తేలాల్సిన అవసరం ఉంది.
విద్యుత్ వెలుగులు అంతంతమాత్రమే..
జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ఆడపిల్లలు ఇక్క డ చదువుతున్నారు. తల్లిదండ్రులు ఎన్నో ఆశలు పెట్టుకుని తమ పిల్లల్ని ఇక్కడ చేర్పిస్తున్నారు. కళాశాల పక్కనే హాస్టల్స్ ఉండటంతో తమ పిల్లల కు భద్రత ఉంటుందని భావిస్తూ ఽధీమాగా ఉంటా రు. కానీ ఇక్కడున్న పరిస్థితులు చూస్తుంటే తల్లిదండ్రులకు ఆందోళన కలగక మానదు. కళాశాల, హా స్టల్స్ ప్రాంగణానికి ప్రహరీ పూర్తిగా లేకపోవడమే కాదు విద్యుత్ సౌకర్యం కూడా పూర్తి స్థాయిలో లేదు. రాత్రయితే చీకట్లు అలుముకుంటాయి. ప్రాంగణానికి సరిపడా విద్యుత్ లైట్లు లేకపోవడం కూడా అక్కడున్న పరిస్థితులకు కారణం కావచ్చు.
పోలీసు పహారా అవసరం
మహిళా కళాశాల ప్రాంగణంలో ఉన్న లోపాలు, అక్కడ కనబడుతున్న మద్యం బాటిళ్లు చూస్తుంటే ఎప్పుడు ఏ అఘాయిత్యం జరగడానికై నా అవకాశం ఉంటుంది.
●దీనిపై సంబంధిత అధికారులు దృష్టి సారించడమే కాకుండా ప్రభుత్వం కూడా అక్కడ పూర్తి స్థాయిలో ప్రహరీ, విద్యుత్ లైట్లు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది.
●నగరం నడిబొడ్డున విద్యార్థినుల ఉన్న హాస్టల్స్ ఎక్కువగా ఉండటంతో ఇక్కడ భద్రత పెంచాలనే డిమాండ్ వినిపిస్తోంది.
●రాత్రిపూట గస్తీ ఉండాలి. ఆడపిల్లలు ఉన్న హాస ల్స్ వైపు బయట వ్యక్తులు వెళ్లకుండా చూడాలి.
●అక్కడ చదువుతున్న ఆడపిల్లలు కూడా జాగ్రత్తగా ఉండాలి. అక్కడే చదువుకుని, అక్కడే వసతి ఉండటంతో తప్పనిసరి అయితే తప్ప బయట తిరగడానికి ప్రయత్నించకూడదు.
●ఇప్పటికే నగరంలో గంజాయి బ్యాచ్ తిరుగుతోంది. దానికి తోడు మందు బాబులు ఎక్కువయ్యారు. ఈ సమయంలో హాస్టళ్లలో జాగ్రత్తలు తీసుకోవడం అత్యవసరం.
ఆగమేఘాల మీద చర్యలు..
●దాడి ఘటన నేపథ్యంలో హాస్టల్స్ వద్ద అత్యవసరంగా మూడు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ప్రిన్సిపాల్‌ను ఆదేశించారు.
●కళాశాలలోని ప్రిన్సిపాల్ బ్లాక్‌లో మాత్రమే వాచ్ మెన్ ఉన్నారు. మిగతా ప్రాంగణం.. వసతి గృహాల వద్ద వాచ్‌మెన్ లేరు. ఒక హోంగార్డును నియమించాలని ఆయన జీతభత్యాలు బీసీవెల్ఫేర్ తరఫున చెల్లిస్తామని బీసీ వెల్ఫేర్ అధికారిణి కలెక్టర్ దృష్టికి వెళ్లారు. కలెక్టర్ సానుకూలంగా స్పందించారు.
●అలాగే విద్యుత్ లైట్లు వెలిగిలా సత్వర చర్యలు తీసుకున్నారు.
మహిళా కళాశాల ప్రిన్సిపాల్ బ్లాక్ పక్కన వాటర్ ట్యాంక్ దగ్గర కాస్త ఖాళీగా ఉన్న స్థలమిది. ఈ స్థలంలో మెక్ డోవల్, ఇంపీరియల్ బ్లూ అనే పేరు గల ఖాళీ మద్యం బాటిళ్లు ఉన్నాయి. ప్రభుత్వ కళాశాల ప్రాంగణం. అది కూడా మహిళా కళాశాల. దాని పక్కనే బీసీ, ఎస్సీ1, ఎస్సీ2, ఎస్సీ3, ఎస్టీ, దివ్యాంగుల మహిళా హాస్టల్స్ ఉన్నాయి. దాదాపు 2వేల మందికి పైగా ఆడపిల్లలు ఉండే ప్రాంగణంలో మద్యం బాటిళ్లు కనిపించడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. క్యాంటిన్ దగ్గర కూడా మద్యం బాటిళ్లు దర్శనమిచ్చాయి.
Comments
Please login to add a commentAdd a comment