సీతమ్మ శీతకన్ను
● కేంద్ర బడ్జెట్‌లో సిక్కోలుకు రిక్తహస్తం ● స్వల్పకాలిక ప్రయోజనాలు తప్ప ఒరిగిందేమీ లేదు ● కేటాయింపుల్లో కనిపించని ప్రస్తావన
2025
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: సీతమ్మ సిక్కోలుపై శీతక న్ను వేసినట్టుంది. కేంద్ర బడ్జెట్‌లో జిల్లాలోని కీలక ప్రాజెక్టులకు నిధులు దక్కలేదు. జిల్లా ఎంపీ రామ్మోహన్‌నాయుడు కేంద్ర మంత్రిగా ఉన్నా జిల్లాకు కేటాయింపులు తీసుకురావడంలో ఘోరంగా విఫలమయ్యారు. శనివారం కేంద్రమంత్రి నిర్మల ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో స్వల్పకాలిక, వ్యక్తిగత ప్రయోజనాలు తప్ప అంతకుమించి ఏమీ లేవు. రూ.12 లక్షల వరకు వేతనదారులకు ట్యాక్స్ మినహాయింపు ఇవ్వడంతో జిల్లాలో 3,500 మందికి లబ్ధి చేకూరనుంది. జలజీవన్ మిషన్ పొడిగించడం వల్ల మరికొన్ని ఇళ్లకు ఇంటింటికీ కుళాయి కనెక్షన్‌లు వచ్చే అవకాశం ఉంది. కిసాన్ క్రెడిట్ కార్డు లోన్ లిమిట్ రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచడంతో జిల్లాలోని కొంతమంది రైతులకు కాస్త రుణ వెసులుబాటు పెరగనుంది.
జిల్లాకు చోటు దక్కేనా..?
రైతులకు ఉత్పాదకత సుస్థిరత, మార్కెట్ సౌలభ్యాన్ని పెంచేందుకు ప్రత్యేక దృష్టి సారించి నట్టు కేంద్రం ప్రకటించింది. తక్కువ ఉత్పాదకత, సగటు కంటే తక్కువ రుణ పరిమితులు ఉన్న 100 జిల్లాలను లక్ష్యంగా చేసుకుని ప్రభుత్వం ధన్ ధాన్య కృషి యోజన ప్రారంభిస్తుంది. సుస్థిర వ్యవసా యం పద్ధతులను ప్రోత్సహించడం ద్వారా, రుణ సౌలభ్యాన్ని మెరుగు పర్చడం ద్వారా రైతులకు ప్రయోజనం చేకూర్చడమే ఈ పథకం లక్ష్యం. ఈ పథకంలో మన జిల్లాకు చోటు దక్కుతుందో లేదో చూడాలి. అలాగే దేశ వ్యాప్తంగా వైద్య సీట్లను పెంచబోతున్నట్టు వెల్లడించారు. మన జిల్లాలో ఉన్న ఏకై క ప్రభుత్వ మెడికల్ కళాశాలైన రిమ్స్‌కు మేలు జరుగుతుందేమో వేచి చూడాలి.
జిల్లాకు నిరాశే..
●జిల్లాలో కిడ్నీ ఆస్పత్రి ఉంది. దీనిపై పరిశోధనలకు కేంద్రం పైసా సాయం కూడా ప్రకటించకపోవడం శోచనీయం.
●కేంద్ర ప్రభుత్వం తాజా బడ్జెట్‌లో రాష్ట్రంలో రో డ్లు, వంతెనల నిర్మాణానికి రూ.240కోట్లు మాత్ర మే కేటాయించింది. ఇందులో మనకెంత దక్కుతుందో చూడాలి.
●జిల్లాలో అమృత్ భారత్ పథకం కింద పలాస, ఇచ్ఛాపురం నియోజకవర్గాల పరిధిలో రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులకు గతంలోనే శ్రీకారం చుట్టారు. ఆ పనులే నత్తనడకన సాగుతుంటే.. కొత్త నిర్మాణాలపై ఎలాంటి ప్రకటన చేయలేదు.
●వైఎస్సార్‌సీపీ హయాంలో మొదలైన మూలపేట పోర్టు, బుడగట్లపాలెం పిషింగ్ హార్బర్, జెట్టీ నిర్మాణాలకు సాయం దక్కలేదు.
Comments
Please login to add a commentAdd a comment