●రాష్ట్ర ప్రజలను వంచించడమే..
కేంద్ర బడ్జెట్‌లో ఎక్కడా ఆంధ్రప్రదేశ్ ప్రస్తావన లేకపోవడం రాష్ట్ర ప్రజలను వంచించడమే. రాష్ట్రాల వారీగా విడుదల చేసిన జాబితాలోనూ ఏపీ ప్రస్తావన లేదు. కొత్త ప్రాజెక్టులేవీ ప్రకటించలేదు. అమరావతి, మెట్రో రైలు ఊసు కూడా లేదు. టీడీపీకి 21 మంది ఎంపీలు ఉన్నా.. కేంద్రం నుంచి బడ్జెట్‌లో ఏమీ కేటాయింపులు పొందలేకపోయారు.
– ధర్మాన కృష్ణదాస్, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు
●ఏపీకి ఒరిగిందేమీ లేదు
కేంద్ర మంత్రి నిర్మలమ్మ ప్రవేశపెట్టిన బడ్జెట్ వల్ల ఏపీకి ఒరిగేది ఏమీ లేదు. కేంద్రానికి మద్దతు ఇస్తున్న ఎంపీలు సమాధానం చెప్పారు. కేంద్రంలో భాగస్వామిగా ఉండి నిధులు తీసుకురాలేకపోయారు. – ఎం.సత్యనారాయణ, కాంగ్రెస్ పార్టీ నాయకుడు
Comments
Please login to add a commentAdd a comment