విద్యార్థినిపై దాడి కేసులో ఆసక్తికర పరిణామాలు
● పోలీసుల అదుపులో అనుమానితుడు? ● శనివారం రోడ్డెక్కిన విద్యార్థులు ● వార్డెన్‌పై సస్పెన్షన్ ఎత్తి వేయాలని, నిందితుడిని శిక్షించాలని డిమాండ్ ● సీరియస్ అయిన స్థానిక ఎమ్మెల్యే ● విద్యార్థులతో మాట్లాడిన ఎస్పీ మహేశ్వరరెడ్డి
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం:
శ్రీకాకుళం మహిళా కళాశాల ప్రాంగణంలో డిగ్రీ విద్యార్థినిపై జరిగిన దాడి వ్యవహారంలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఘట న జరిగాక వార్డెన్‌పై సస్పెన్షన్ వద్దని, నిందితుడిని శిక్షించాలని విద్యార్థులు శనివారం ఆందోళన చేశా రు. దీనిపై స్థానిక ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆనక ఎస్పీ వచ్చి విద్యార్థులందరితో మాట్లాడారు. వివరాల్లోకి వెళితే..
ఘటన నేపథ్యంలో బాలిక హాస్టల్ వార్డెన్‌ను శుక్రవారం సాయంత్రం కలెక్టర్ సస్పెండ్ చేశారు. తెల్లవారేసరికి ఆ హాస్టల్‌లో చదువుతున్న మిగతా విద్యార్థులు రోడ్డెక్కారు. తమ వార్డెన్‌పై సస్పెన్షన్‌ను ఎత్తి వేయాలని, దాడికి పాల్పడిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని, ప్రభుత్వం డౌన్ డౌన్ అని నినా దాలు చేస్తూ మహిళా కళాశాల గేట్ దగ్గర నిరసన తెలియజేశారు. దీంతో అటువైపుగా వెళ్తున్న సమయంలో శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ వారి వ ద్దకు వెళ్లి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వార్డెన్ సస్పెన్షన్ ఎత్తివేయాలని కోరడం సరికాదని, నిందితుడిని తప్పనిసరిగా శిక్షిస్తామని నచ్చ చెప్పే ప్రయ త్నం చేశారు. అయినప్పటికీ విద్యార్థులు వెనక్కి త గ్గకుండా నగరంలో ప్లకార్డులతో నిరసన ర్యాలీ చే యడమే కాకుండా కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు.
అదుపులో అనుమానితుడు?
గురువారం రాత్రి విద్యార్థిపై జరిగిన దాడి ఘటన నేపథ్యంలో పోలీసులు శుక్రవారం అప్రమత్తమై, నాలుగు బృందాలుగా ఏర్పడి, అనుమానిత వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టుగా ప్రచారంలోకి వచ్చింది. ఇదే సమయంలో ఒక్కసారిగా హాస్టల్ విద్యార్థులు నిరసనకు దిగడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే వార్డెన్ విధుల్లో ఉంటే విచారణ సరిగా జరిగే అవకాశం ఉండదని స్థానిక ఎమ్మెల్యే విద్యార్థులకు వివరించారు. వార్డెన్ తప్పు లేకపోతే సస్పెన్షన్ ఎత్తివేయడం జరుగుతుందని ఎమ్మెల్యే వివరించారు. కానీ, ఆ విద్యార్థులు వినలేదు. నిరసన ర్యాలీ చేయడానికే సిద్ధమయ్యారు. దీంతో ఎమ్మెల్యే గొండు శంకర్ సీరియస్‌గా తీసుకున్నారు. పరీక్షలు అవుతున్న వేళ, హాస్టల్‌లో ఉండాల్సిన సమయంలో విద్యార్థులు బయటకు రావడమేంటని, అనుమతి లేకుండా నిరసనలకు దిగడమేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరైతే నిరసన ర్యాలీ చేశారో వారిపై చర్యలు తీసుకోవాలని బీసీ వేల్ఫేర్ అధికారులతో పాటు కళాశాల ప్రిన్సిపాల్‌ను ఆదేశించారు. అంతేకాకుండా ఇక్కడ జరిగిన విషయాన్ని కలెక్టర్‌కు కూడా ఎమ్మెల్యే వివరించారు. సస్పెన్షన్‌కు గురైన పూర్ణ స్థానంలో ఆ ప్రాంగణంలో ఎస్సీ హాస్టల్ వార్డెన్‌గా పనిచేస్తున్న సరితకు ఇన్‌చార్జి ఇవ్వాలని కూడా సిఫార్సు చేశారు.
సమస్యలుంటే నిర్భయంగా చెప్పండి
శ్రీకాకుళం క్రైమ్ : సమస్యలు ఉంటే నిర్భయంగా చెప్పాలని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి జిల్లా కేంద్రంలో ఉన్న ఉమెన్స్ కళాశాల విద్యార్థినులకు సూచించా రు. శనివారం సాయంత్రం ఎస్పీ ఇక్కడి విద్యార్థినులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించి అవగా హన కల్పించారు. సమస్యలు ఉంటే తల్లిదండ్రుల కు చెప్పాలని, వారికి చెప్పుకోలేని సమస్య అయితే పోలీసులకు తెలపాలని, నేరుగా తనను కూడా 6309990800 ఫోన్ నంబర్ ద్వారా నిర్భయంగా సంప్రదించవచ్చన్నారు.
Comments
Please login to add a commentAdd a comment