‘అల్లు’కు అరుదైన గౌరవం
జలుమూరు: వమరవల్లి డైట్ అధ్యాపకుడు, శ్రీముఖలింగం గ్రామానికి చెందిన అల్లు అప్పన్నకు అరుదైన గౌరవం దక్కింది. జాతీయ విద్యా పరిశోధన శిక్షణా సంస్థ(న్యూ ఢిల్లీ) ఆధ్వర్యంలో శనివారం మైసూరులో నిర్వహించిన జాతీయ విద్యా సదస్సులో ఆయన ప్రసంగించారు. ఉన్నత పాఠశాల స్థాయి విద్యార్థులు–కెరీర్ మదింపుపై అధ్యయనం అనే అంశంపై పరిశోధన నివేదిక అందజేశారు. దేశవ్యాప్తంగా 78 మంది ప్రతినిధులు హాజరుకాగా, అందులో శ్రీకాకుళం నుంచి అల్లు అప్పన్న ప్రసంగించి ప్రశంసాపత్రం అందుకున్నారు. ఈ సందర్భంగా అప్పన్నను డీఈఓ తిరుమల చైతన్య, గ్రామస్తులు అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment