శ్రీకాకుళం
ఆదివారం శ్రీ 2 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025
టికెట్ల బుకింగ్ కోసం
https://heliride.arasavallisungod.org
వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు.
డచ్ భవనం వద్ద హెలికాప్టర్
శ్రీకాకుళం పాతబస్టాండ్: రథ సప్తమి పర్వదినం సందర్భంగా మూడో తేదీ అర్ధరాత్రి నుంచి స్వామి నిజరూప దర్శనం కనువిందు చేయనుంది. ఈ సందర్భంగా వివిధ రకాల టికెట్లను అందుబాటులో ఉంచామని జిల్లా రెవెన్యూ అధికారి తెలిపారు.
●రూ.100 దర్శన టికెట్లు: అరసవల్లి దేవాలయ ప్రాంగణంలోని కౌంటర్లో లభిస్తాయి. (ఒక్కరికి మాత్రమే ప్రవేశం)
●రూ.300 దర్శన టికెట్లు: అరసవల్లి దేవాలయ ప్రాంగణంలోని కౌంటర్లో లభిస్తాయి. (ఒక్కరికి మాత్రమే) ●రూ. 500 క్షీరాభిషేకం టికెట్లు: అరసవల్లి దేవాలయ ప్రాంగణంలోని కౌంటర్లో లభిస్తాయి. (ఇద్దరికి మాత్రమే).
●ఫిబ్రవరి 4వ తేదీ తెల్లవారు జూము ఒంటి గంట నుంచి 6 గంటల వరకు..
●రూ.300 దర్శన టికెట్లు (జిల్లా అధికారులు, ఇతర ఉన్నత అధికారులకు): యూనియన్ బ్యాంక్, అరసవల్లిలో లభిస్తాయి. దీనికి శ్రీకాకుళం రెవెన్యూ డివిజన్ అధికారి అనుమతి తప్పనిసరి. ఫిబ్రవరి 4వ తేదీ ఉదయం 7 నుంచి రాత్రి 8 గంటల వరకు మాత్రమే ఈ టికెట్లపై దర్శనం చేయవచ్చు.
●భక్తులు ఈ టికెట్లను ఒక్కరోజు ముందుగానే డబ్బులు చెల్లించి పొందవచ్చని ప్రకటనలో పేర్కొన్నారు.
నేటి నుంచి టికెట్ల విక్రయాలు
ఆదివారం షెడ్యూల్ ఇదే..
●ఉదయం 6 గంటలకు 80 ఫీట్ రోడ్డులో సామూహిక సూర్యనమస్కారాలు. ●ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు డచ్ భవనం వద్ద హెలికాప్టర్ రైడ్ (టిక్కెట్లు ఉన్నవారే). ●10 గంటల నుంచి ఎన్టీఆర్ మున్సిపల్ గ్రౌండ్స్‌లో గ్రామీణ క్రీడా జిల్లా, రాష్ట్ర స్థాయి పోటీలు.
●మధ్యాహ్నం 2.30 గంటల నుంచి డేఅండ్ నైట్ కూడలి నుంచి అరసవల్లి వరకు శోభయాత్ర..దారి పొడవునా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు. ●సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఆర్ట్స్ కళాశాల మైదానంలో సాంస్కృతిక కార్యక్రమాలు.
●సాయంత్రం 5 గంటల నుంచి వరుసగా ఆరోహి స్కూల్ ఆఫ్ మ్యూజిక్, దుంపల ఈశ్వర్ సినీ సంగీత బృందం, యామినీ కృష్ణ శాసీ్త్రయ సంగీత బృందం, పరిమళ బృంద జానపద నృత్యాలు, అనూరాధ బృందం శాసీ్త్రయ నృత్యాలు, లక్ష్మీగణపతి శర్మ సినీ శాసీ్త్రయ సంగీత బృందం, పలువురు హాస్యనటుల ధూంధాం..అనంతరం చివరగా...రాత్రి 10 గంటలకు ‘పంచ రత్నాలు’ పేరిట పౌరాణిక డ్రామా ఉంటాయి.
●రాత్రి 7 నుంచి 8 గంటలకు లేజర్ షో.
అపు‘రూప’ ప్రతిభ
Comments
Please login to add a commentAdd a comment