27న విద్యాసంస్థల్లో సామూహిక సూర్యనమస్కారాలు
శ్రీకాకుళం న్యూకాలనీ: రథసప్తమిని పురస్కరించుకుని ఈనెల 27న విద్యాసంస్థల్లో సామూహిక సూర్యనమస్కారాలు నిర్వహించాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ నిర్ణయించారు. రథసప్తమి సందర్భంగా అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఉత్సవాలను రాష్ట్ర పండగగా చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో.. జిల్లాలోని అన్ని యాజమాన్యాల పాఠశాలలు, జూనియర్ కళాశాలలు, ఇతర అన్ని విద్యాసంస్థల్లో ఈనెల 27వ తేదీన సామూహిక సూర్య నమస్కారాలు నిర్వహించాలని, వాటి ఫొటోలను అప్లోడ్ చేయించాలని కలెక్టర్ ఆదేశించినట్టు డీఈఓ డాక్టర్ ఎస్.తిరుమల చైతన్య, డీవీఈఓ ఎస్.తవిటినాయుడు, ఆర్‌ఐఓ పి.దుర్గారావు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment