No Headline
● రిమ్స్‌లో పరిస్థితి మరింత దారుణం
● కీలక ఔషధాలు బయట కొనుగోలు చేసుకోవాలని సలహా ఇస్తున్న సిబ్బంది
● ప్రతి ప్రిస్క్రిప్షన్‌లో రెండు మూడు రకాలు దొరకని పరిస్థితి
● బయట కొనుక్కోలేక ఇబ్బందులు పడుతున్న రోగులు
● రోగుల క్షేమం పట్టించుకోని కూటమి ప్రభుత్వం
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం:
చంద్రబాబు ప్రభుత్వం ధర్మాసుపత్రులను భ్రష్టుపట్టిస్తోంది. ఇప్పటికే ఖాళీ అయిన వైద్యులు, సిబ్బంది పోస్టులను భర్తీ చేయకుండా, మౌలిక సౌకర్యాలు కల్పించకుండా, ఉన్న ఆసుపత్రులను కాపాడుకోకుండా నిర్లక్ష్యం చేస్తోంది. ఆరోగ్యశ్రీ పథకాన్ని సైతం నిర్వీర్యం చేసింది. తాజాగా ప్రభుత్వాసుపత్రులకు మందులు( ఔషధాలు) సైతం సరఫరా చేయడం లేదు. భారీగా బడ్జెట్ తగ్గించేయడంతో మందుల కొరత నెలకొంది. వైద్యులు రాసిన దాంట్లో కొన్నింటిని బయట కొనుగోలు చేసుకోవాలని ఫార్మసీ సిబ్బంది బాహాటంగా చెప్పేస్తున్నారు. కూటమి సర్కారు వచ్చాక రిమ్స్ ఆసుపత్రికి కేటాయిస్తున్న మందుల బడ్జెట్‌ను పరిశీలిస్తే గతం కన్నా ఏ స్థాయిలో బడ్జెట్ తగ్గించేశారో ఇట్టే అర్ధమవుతుంది. జిల్లా కేంద్రంలోని ప్రధానమైన రిమ్స్ పరిస్థితే ఇలా ఉందంటే.. అర్బన్ హెల్త్ సెంటర్లు, ఏరియా ఆస్పత్రులు, కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాలు, పీహెచ్‌సీలు, సబ్‌సెంటర్ల పరిస్థితి ఇంకెంత దారుణంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ప్రజారోగ్యాన్ని, రోగులను ఈ ప్రభుత్వం ఎంత చిన్న చూపు చూస్తుందో అవగతమవుతోంది. సంక్షేమ పథకాలను నిలిపేసినట్టే, వైద్యాన్ని కూడా వదిలించుకోవాలని చూస్తున్నట్టు స్పష్టమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment