No Headline
రథసప్తమి వేడుకలకు జిల్లా కేంద్రాన్ని సుందరంగా తయారుచేయడం మాట అటుంచితే ప్రజాధనాన్ని మాత్రం యథేచ్ఛగా దుర్వినియోగం చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. శ్రీకాకుళం అర్బన్ డెవలప్‌మెంట్ (సుడా) నుంచి సుమారు రూ.40 లక్షలకు పైగా నిధులు వెచ్చించి అరసవల్లి మిల్లు జంక్షన్‌తో పాటు పలు ప్రధాన కూడళ్ల వద్ద సుందరీకరణ పనులు చేస్తున్నారు. ఈ క్రమంలో మిల్లు జంక్షన్ వద్ద బాబూ జగజ్జీవన్‌రామ్ విగ్రహం వద్ద ఫౌంటేన్ ఏర్పాటు చేసేందుకు మంగళవారం కాంక్రీట్ వాల్ నిర్మించారు. ఏం జరిగిందో గానీ బుధవారం ఉదయమే విరగ్గొట్టేశారు. సరైన ప్లానింగ్ లేక, అధికారులు పర్యవేక్షణ లేక నిధులు వృథా చేస్తూ చేసిన పనులే మళ్లీ మళ్లీ చేస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పరోక్షంగా కాంట్రాక్టర్‌కు లబ్ధి చేకూర్చేందుకే ఇలా లక్షలాది రూపాయలు వృథా జరిగేలా పనులు చేస్తున్నారనే పలువురు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి హడావిడి పనులకు స్వస్తిచెప్పి పూర్తిస్థాయి పర్యవేక్షణతో పనులు చేయించాలని కోరుతున్నారు.
–శ్రీకాకుళం (పీఎన్ కాలనీ)
యథేచ్ఛగా ప్రజాధనం దుర్వినియోగం
Comments
Please login to add a commentAdd a comment