ఎల్లమ్మ గుడిలో నాగుపాము
కవిటి : మండలంలోని కపాసుకుద్ధి పంచాయతీ పుటియాదళ గ్రామ పంటపొలాల్లో వెలసిన ఎల్లమ్మ అమ్మవారి గుడిలో బుధవారం ఉదయం నాగుపాము కలకలం రేపింది. వాస్తవానికి ప్రతి గురువారం ఎల్లమ్మను దర్శించుకునేందుకు అధికసంఖ్యలో భక్తులు వస్తుంటారు. ఈ క్రమంలో ముందురోజైన బుధవారం ఆలయం మొత్తాన్ని శుభ్రం చేస్తుంటారు. ఎప్పటిలాగే గుడి అర్చకత్వ బాధ్యతలు నిర్వహిస్తున్న ముత్యాల విమల.. అమ్మవారి పీఠంలో విగ్రహాల్ని బయటకు తీసి లోపలి పీఠం కడుగుతుండగా ఒక్కసారిగా పెద్దనాగుపాము పడగవిప్పి కనిపించింది. వెంటనే ఆమె భయాందోళనతో బయటకు వచ్చేసింది. రైతులు పామును బయటకు పంపించేందుకు ప్రయత్నించినా సఫలం కాకపోవడంతో విగ్రహాలను బయటే వదిలేసి వెళ్లిపోయారు.
Comments
Please login to add a commentAdd a comment