విద్యా ప్రమాణాలు మెరుగుపర్చాలి
సారవకోట: విద్యా ప్రమాణాలు మెరుగుపర్చేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని డీఈఓ తిరుమల చైతన్య సూచించారు. బుధవారం సారవకోట, అలుదు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలను తనిఖీ చేశారు. ఉదయం ప్రార్థన సమయానికే సారవకోట హైస్కూల్‌కు చేరుకుని ఉపాధ్యాయుల సమయపాలన, విద్యార్థుల హాజరు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారిపై ప్రత్యేక శ్రద్ధ కనబర్చాలని సూచించారు. రానున్న 10వ తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాల సాధనకు ప్రతిఒక్కరూ కృషి చేయాలన్నారు. అనంతరం అలుదు హైస్కూల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించారు.
Comments
Please login to add a commentAdd a comment