మహిళలు, చిన్నారులపై నేరాలు అరికట్టాలి
శ్రీకాకుళం క్రైమ్ : మహిళలు, చిన్నారులపై జరిగే కేసులు, ఎస్సీ, ఎస్టీ అత్యాచార కేసులపై దృష్టి కేంద్రీకరించాలని ఎస్పీ కె.వి.మహేశ్వరరెడ్డి పోలీసు అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలో అదనపు ఎస్పీ కె.వి.రమణతో కలసి జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా డీఎస్పీలు, సీఐలు, ఎస్‌ఐలతో సమీక్ష నిర్వహించారు. పెండింగ్ ఫిర్యాదులు, హిట్ అండ్ రన్ కేసులపై ఆరా తీశారు.గ్రేవ్ కేసుల దర్యాప్తు వేగవంతం చేయాలన్నారు. సీసీ కెమెరాలు క్షుణ్ణంగా పరిశీలించి ప్రమాద కేసులు ఛేదించాలని సూచించారు. రోడ్డు ప్రమాదాలు అరికట్టేలా చర్యలు తీసుకోవాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment