పర్యాటకులను ఆకర్షించేలా ‘సాగర్‌’ అభివృద్ధి | - | Sakshi
Sakshi News home page

పర్యాటకులను ఆకర్షించేలా ‘సాగర్‌’ అభివృద్ధి

Published Fri, Aug 23 2024 3:12 AM | Last Updated on Fri, Aug 23 2024 3:12 AM

పర్యాటకులను ఆకర్షించేలా ‘సాగర్‌’ అభివృద్ధి

నాగార్జునసాగర్‌: బుద్ధవనంతోపాటు నాగార్జునసాగర్‌ జలాశయ తీరంలో ప్రపంచ దేశాల పర్యాటకులను ఆకర్షించేందుకు అంతర్జాతీయ ప్రమాణాలతో ఏకో, టెంపుల్‌ పర్యాటక అభివృద్ధికి ప్రతిపాదనలు తయారు చేయనున్నట్లు తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ప్రకాశ్‌రెడ్డి తెలిపారు. టూరిజం మాజీ సీఎండీ, మార్గదర్శకులు(మెంటర్‌)చెన్నూరి ఆంజనేయరెడ్డి ఆధ్వర్యంలో టూరిజం, యువజన సర్వీసులు, సాంస్కృతిక, రాష్ట్ర పురావస్తు శాఖ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ వాణిప్రసాద్‌, పర్యాటక శాఖ డైరెక్టర్‌ ఈలా త్రిపాటి, బుద్ధవనం కన్సల్టెంట్‌, చారిత్రక పరిశోధకుడు ఈమని నాగిరెడ్డి, రాష్ట్ర పురావస్తు శాఖ డిప్యూటీ డైరెక్టర్లు నారాయణ, నాగరాజు, తెలంగాణ టూరిజం చీఫ్‌ ఇంజనీర్‌ వెంకటరమణ, టూరిజం హోటల్స్‌ జనరల్‌ మేనేజర్‌ నాదన్‌, టూరిజం వాటర్‌ ఫ్లూయిట్‌ జనరల్‌ మేనేజర్‌ ఇబ్రాహీం, బుద్ధవనం ఓఎస్‌డీ సుదన్‌రెడ్డి, ఎఫ్‌డీఓ సంగీతలతో కలిసి లాంచీలో జలాశయం మధ్యలో 415 ఎకరాల్లో ఉన్న చాకలిగట్టుకు వెళ్లారు. ఐలాండ్‌గా ఉన్న దీనిపై అటవీశాఖతో కలిపి ఏకోటూరిజం అభివృద్ధికి గల అవకాశాలపై చర్చించారు. బోటింగ్‌, వాటర్‌ స్పోర్ట్స్‌, క్యాంపింగ్‌, రిసార్ట్స్‌ ఏర్పాటుకు అనుకూలంగా ఉన్నట్లు వారు తెలిపారు. అటవీ శాఖ ఉన్నతాధికారులతో కలిసి త్వరలో సర్వే నిర్వహించి, రెండు శాఖల సమన్వయంతో పర్యాటకంగా అభివృద్ధికి ప్రతిపాదనలు తయారు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఏలేశ్వరంపై ఉన్న శివాలయ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలు, ప్రతిపాదనలు తయారు చేసేందుకు సర్వే నిర్వహించనున్నట్లు తెలిపారు. అనంతరం బుద్ధవనంలో జరుగుతున్న పనులను పరిశీలించారు. బుద్ధవనంపై ఈమని నాగిరెడ్డి వారికి వివరించారు. బుద్ధవనంలో ధ్యానవనం కాంపోనెట్స్‌, మిగిలిపోయిన పనులు చేసేందుకు ఈ బడ్జెట్‌లోనే నిధులు కేటాయించేందుకు ప్రతిపాదనలు తయారు చేయనున్నట్లు తెలిపారు. బుద్ధవనాన్ని త్వరలోనే సీసీ కెమెరాల పర్యవేక్షణలోకి తీసుకురానున్నట్లు పేర్కొన్నారు. వీరి వెంట బుద్ధవన డిజైనర్‌ శ్యాంసుందర్‌రావు, ఏఈ నజీష్‌, విజయవిహార్‌ మేనేజర్‌ కిరణ్‌కుమార్‌, లాంచీ యూనిట్‌ మేనేజర్‌ హరి ఉన్నారు.

తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ప్రకాశ్‌రెడ్డి

నాగార్జునసాగర్‌లో పలు ప్రదేశాల పరిశీలన

చాకలిగట్టు, ఏలేశ్వరం ఎకో, టెంపుల్‌ టూరిజం అభివృద్ధికి ప్రతిపాదనలు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement